ఇప్పుడు మరొక జంట పిల్లల కోసం దిగొచ్చింది

Update: 2017-08-26 11:00 GMT

ఈ మధ్యన సినిమా వాళ్ళ ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు పెద్ద హాట్ టాపిక్ వ్యవహారాల్లానే కనబడుతున్నాయి. ఒకప్పుడు అయితే ఈ తరహా వ్యవహారాలు ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కనబడేవి. కానీ ఇక్కడ సౌత్ లో కూడా ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు ఎక్కువే అయ్యాయి. మొదటినుండి నటీనటులు ఒక సినిమాలో కలిసి నటించినప్పుడే అనుకొకుండా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రేమకే ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లివరకు వ్యవహారాన్ని తెచ్చుకోవడంలేదు. మరికొంతమంది ప్రేమ పెళ్లి చేసుకుని మరీ పిల్లలు పుట్టకముందే విడిపోతున్నారు. మరికొంతమంది పిలల్లు పుట్టాక కూడా విభేదాలు వచ్చి మరి విడాకులు తీసుకుంటున్నారు.

అయితే అలా పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్న జంటలు మళ్ళీ పిల్లలవల్లే తిరిగి తాము ఒక్కటవుతున్న.... కానీ అది కేవలం స్నేహ బంధమే కానీ పెళ్లి బంధం కాదంటున్నారు. అలా బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ జంట పెళ్లి, పిల్లలు, విడాకులు తర్వాత ఈ జంట పిల్లల కోసమే తాము కలిసి తిరుగుతున్నామంటున్నారు. అయితే తమ మధ్యన స్నేహం తప్ప ఇంకేం లేదంటూ స్టేట్మెంట్స్ ఒకటి. అలాగే ఈ మద్య కొత్తగా అర్భాజ్ ఖాన్, మలైకా అరోరాలు కూడా కొడుకు కోసమే కలిసి తిరుగుతున్నాం కానీ మా మధ్యన వివాహ బంధం తెగిపోయిందంటున్నారు.

ఇక ఇక్కడ సౌత్ లో కొత్తగా రంభ వంటి నటీమణులు భర్తతో విడాకుల కోసం ప్రయత్నించి మరీ మళ్ళీ పిల్లలకోసమే ఆ విడాకులు వద్దంటూ కోర్టుకెక్కి మరి కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ తరహాలోనే మరో జంట కూడా తమకు విడాకులు వద్దంటూ కోర్టుని ఆశ్రయించింది. తెలుగులో 'ఈగ' వంటి సినిమాతో మంచి పేరు సంపాదించిన 'కిచ్చ' సుదీప్ తన భార్యతో విడాకులు కావాలని 2015లో బెంగుళూర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ అయితే వేసాడు. కానీ కోర్టుకి హాజరుకాకుండా సుదీప్ భార్య ప్రియా, సుదీప్ కూడా కోర్టు సమయాన్ని వృధా చెయ్యడంతో చివరకు సుదీప్ ని కోర్టు చివరిసారిగా మీరు మీ భార్య నుండి ఎందుకు విడాకులు పొందాలనుకుంటున్నారో చెప్పాలని గట్టిగా చెప్పడంతో దానికి సుదీప్ తన కుమార్తె సాన్వి జీవితం కోసం భార్యతో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఇక ఒక్క సుదీప్ మాత్రమే ఇలాంటి సమాధానం చెప్పలేదు... అతని భార్య ప్రియా కూడా అదే సమాధానం చెప్పి మరి తమ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు. దీంతో కోర్టు కూడా సుదీప్, ప్రియల వివరణకు సంతృప్తి చెంది... వారికి విడాకుల వ్యవహారం కొట్టేసిందంటున్నారు. దీంతో సుదీప్ విడాకుల కథ కూతురు సాన్వి సంతోషం కోసం సుఖాంతం చేశారన్నమాట.

Similar News