తన వాక్చాతుర్యంతో... మనసుకు హత్తుకునే పదాలతో అందరిని ఆకట్టుకునే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమాలను ఏదో ఒక నవల నుండో, లేకుంటే ఏదో వక పరభాషా చిత్రంనుండో కాపీ చేస్తాడనే నానుడి ఉంది. అది కేవలం నానుడి మాత్రమే కాదు నిజమని అయన దర్శకత్వం వహించిన అ.. ఆ సినిమా అప్పుడు... మొన్నటికి మొన్న విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అప్పుడు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. కానీ త్రివిక్రమ్ మాత్రం మొన్నటివరకు తాను కాపీ కొట్టిన విషయాన్నీ నలుగురిలో ఒప్పుకునేవాడు కాదు. అదే విషయం అ... ఆ సినిమా విడుదలైనప్పుడు స్పష్టంగా తెలిసింది. ఇక అజ్ఞాతవాసి సినిమా కాపీ రైట్ విషయంలో ఎంతగా రచ్చ జరిగిందో వేరే చెప్పక్కర్లేదు. సినిమా విడుదలకు ముందు టి సీరీస్ నుండి ఆ కాపీ చేసిన ఫ్రెంచ్ సినిమా రైట్స్ ని కొనుక్కుని చివరికి అజ్ఞాతవాసిని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఈసారి మాత్రం త్రివిక్రమ్ తాను తియ్యబోయే సినిమా కోసం ముందే నవల రైట్స్ ని కొనేసుకున్నాడు. ఎన్టీఆర్ తో తియ్యబోతున్న సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి నుంచి ఒక నవలని, అలాగే మధు బాబు దగ్గర నుంచి ఒక నవల యొక్క కాపీ రైట్స్ తీసుకున్నాడు. ఇంతకుముందే యద్దనపూడి సులోచన రాణి మీనా నవల నుండి అ.. ఆ సినిమాని కాపీ కొట్టి సైలెంట్ గా కూర్చున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం ముందు జాగ్రత్తగా ఆమె నుండి ఒక నవల రైట్స్ ని కోనేసేసాడు.
అయితే ఎన్టీఆర్ కోసం మధు బాబు అనే నవల రచయిత నుండి ఒక డిటెక్టీవ్ నవలని కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కథని తీర్చి దిద్దుతున్నాడట. ఇక ఈ కథలో ఎన్టీఆర్ క్రేజ్ కి తగ్గట్టే మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని అంటున్నారు. మరి అజ్ఞాతవాసితో డిజాస్టర్ ని అందుకున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడేమో చూద్దాం.