అఖిల్, విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఒక కొత్త మూవీ ని స్టార్ట్ చేసి చాలా కాలమే అయ్యింది. అక్కినేని నాగార్జున నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెడుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాల షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో అఖిల్ పక్కన హీరోయిన్ ఎవరనేది చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. ఇక టైటిల్ విషయంలోనూ అదే సస్పెన్సు కంటిన్యూ చేస్తున్న చిత్ర యూనిట్ ఈ చిత్రానికి మాత్రం అప్పుడే విడుదల తేదీని ప్రకటించేసింది.
అఖిల్ చిత్రాన్ని డిసెంబర్ 22 న క్రిష్ట్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు నాగార్జున అనౌన్స్ చేసాడు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో క్రిష్టమస్ కానుకగా విడుదల చేసి క్రిష్ట్మస్ సెలవులని క్యాష్ చేసుకోవాలని నాగార్జున గట్టిగా ప్లాన్ చేసాడు. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని కూడా ఈ డిసెంబర్ లోనే తన 'ఎంసీఏ' చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించాడు. మరి ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలో ఇలా రెండు సినిమాల డేట్స్ ని ప్రకటించారు సదరు హీరోలు.
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నాని హీరోగా 'ఎంసీఏ' సినిమాను కూడా డిసెంబర్ 21 న విడుదల తేదిగా ప్రకటించారు. అంటే అఖిల్ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే నాని 'ఎంసీఏ' ని విడుదల చెయ్యనున్నారన్నమాట. మరి నాగార్జున ముందుగా తేదీ ప్రకటించిన కొన్ని గంటల తేడాతోనే నాని కూడా తన సినిమా డేట్ ని ప్రకటించేశాడు. ముందుగా నాగ్ డేట్ ఇచ్చాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ సినిమా విషయంలో ఆయన డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు. మరి నాని కొద్దిగా వెనక బడ్డాడు కాబట్టి వెనక్కి తగ్గుతాడా లేకుంటే అనుకున్న టైం కే వచ్చేస్తాడో అనేది మాత్రం కొన్ని రోజుల వరకు క్లారిటీ వచ్చేలా లేదు.