ఇద్దరి మధ్య వార్ షురూ అంటున్నారు

Update: 2017-06-26 07:00 GMT

ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు నటిస్తున్నారు. జై పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ' తో మరో హిట్ అందుకోవడానికి రెడీగా వున్నాడు. అయితే ఇప్పుడు 'జై లవ కుశ' చిత్రానికి సంబందించిన ఏదో ఒకటి(టీజర్ గాని, రిలీజ్ డేట్) రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పుడు నిజంగానే 'జై లవ కుశ' టీమ్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న' జై లవ కుశ' చిత్రాన్నిసెప్టెంబర్ 21న రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. మరి ఇలా రిలీజ్ డేట్ ప్రకటించడమే గాక జులై ఫస్ట్ వీక్ లో 'జై లవ కుశ' టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు చెబుతున్నారు. అంటే ఎన్టీఆర్ సెప్టెంబర్ 21 వస్తుంటే.... ఒక్క వారం గ్యాప్ లోనే ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ 'పైసా వసూల్' తో బాక్సాఫీసుని షెకాడించడానికి వచ్చేస్తున్నాడు.

మరి ఎన్టీఆర్ జై లవ కుశ సెప్టెంబర్ సెప్టెంబర్ 21 విడుదలనే ప్రకటనతో అబ్బాయ్ కి బాబాయ్ కి వార్ షురూ అంటూ నందమూరి అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.

Similar News