ఇదే మొదటి తమిళ చిత్రం!

Update: 2017-11-23 15:00 GMT

విలక్షణ నటుడు మోహన్ బాబు వారసుడిగా తెరంగేట్రం చేసి నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు విష్ణు. 2003లో వచ్చిన ‘విష్ణు’ చిత్రంతో ఈ హీరో తెరంగేట్రం చేసినా.. 2007లో వచ్చిన ‘ఢీ’ చిత్రంతో ఘన విజయాన్ని సాధించాడు. తనలో కామెడీ టైమింగ్ వర్క్ అవుట్ అవుతుందని భావించి దానిపైనే దృష్టి సారించి చేసిన ‘దేనికైనా రెడీ’ , ‘దూసుకెళ్తా’ , ‘ఈడో రకం – ఆడో రకం’ చిత్రాలు మంచు విష్ణుకు విజయాల్ని అందించాయి. దాంతో కుటుంబ కథల్ని కామెడీకి జోడించి చేస్తున్నాడు ఈ మంచు హీరో.

ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు. విష్ణు తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి జి.నాగేశ్వర్ రావు దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ కాగా.. మరొకటి నూతన దర్శకుడు జిఎస్ కార్తీక్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఓటర్’ . విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఓటర్’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మంచు విష్ణు విడుదల చేశాడు.

‘ఓటర్’ చిత్రాన్ని తమిళంలో ‘కురాల్ 388’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణుకు ఇదే మొదటి తమిళ చిత్రం కావడం విశేషం.

Similar News