ఇది సెట్ అయితే రేర్ ఫీటే?

Update: 2017-11-06 12:00 GMT

టాలీవుడ్ లో హీరోస్ కి అభిమానులు వుంటారని తెలుసు అలాగే హీరోయిన్స్ కి కూడా అభిమానులు వుంటారనీ తెలుసు. కానీ కాజల్ కి మాత్రం పిచ్చెక్కిపోయే ఫాన్స్ వున్నారు. కాజల్ ఏ హీరోతో చేసిన వాళ్ల ఫాన్స్ కి పండగే. ఇప్పటివరకు టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోస్ పక్కన నటించేసింది. కేవలం సీనియర్ హీరో ఒక్క వెంకీతో తప్ప. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగానే ఉంటది అని..మీడియా లో చాలా సార్లు వార్తలు వచ్చినప్పటికి ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు.

తాజాగా తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమాకి కాజల్ ఉంటే బాగుంటుంది అని అటు వెంకీ, డైరెక్టర్ తేజ, నిర్మాత సురేష్ బాబు యునానిమస్ గా డిసైడ్ అయ్యారట. ఆ మేరకు కాజల్ ను కూడా అప్రోచ్ అయ్యారనే టాక్ వినబడుతుంది. ఇక తన కోదాటి డైరెక్టర్ తేజ మీద అభిమానంతో ఈ మధ్యనే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించిన కాజల్ కి ఆ సినిమా తో మంచి హిట్ అందించాడు తేజ. ఇక ఆ హిట్ తో మంచి జోష్ మీదున్న కాజల్ ఇప్పుడు తేజ దర్శకత్వంలో వెంకటేష్ తో నటించడానికి ఒకే చెప్పినట్టు సమాచారం. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది.

అదే నిర్మాత, అదే డైరక్టర్ తో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో అబ్బాయ్ తో నటించిన కాజల్..... ఇప్పుడు అదే నిర్మాత, అదే డైరక్టర్ తో బాబాయ్ పక్కన నటిస్తుందన్నమాట. ఇప్పటికే కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ పక్కన 'మగధీర' లో హీరోయిన్ గా చేసి.... చిరు పక్కన 'ఖైదీ నెంబర్ 150 ' హీరోయిన్ కూడా చేసింది. ఇప్పుడేమో, రానా పక్కన హీరోయిన్ గా చేసి, వెంకీకి హీరోయిన్ గా చేస్తుంది. ఇది కాజల్ కి ఒక రేర్ ఫీట్ అన్ని చెప్పుకోవొచ్చు..

Similar News