పిల్ల జమీందార్ వంటి హ్యూమన్ ఎమోషన్స్ తో సాగే కథని బడ్జెట్ పరిమితులలో కూడా అద్భుతంగా తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ విజయంతో పాటు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు జి.అశోక్. పిల్ల జమీందార్ అంత పెద్ద హిట్ ఐన తరువాత అశోక్ తెరకెక్కించిన చిత్రాలు మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. సుకుమారుడు చిత్రం డిసాస్టర్ కావటం, తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రంగధ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా చాలా మంది ప్రేక్షకులకి తెలియకపోవటం అశోక్ వైఫల్యానికి నిదర్శనం అయ్యాయి.
రెండు చిత్రాలు డిజాస్టర్స్ పడినతరువాత ఏ దర్శకుడికైనా నిర్మాతలని ఒప్పించుకోవటం, ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కించుకోవటం చాలా కష్టమైన పని. కానీ ఇలాంటి సందర్భం లోనే తనకి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దేవుడిలా ప్రత్యక్షమయ్యారని, ముందుగా తాను భాగమతి కథ ప్రభాస్ కి నేరేట్ చేయగా ఆయనే నిర్మాతలుగా యూ.వి.క్రియేషన్స్ వంశి, ప్రమోద్ లని ఒప్పించి, మెయిన్ లీడ్ పోషించటానికి అనుష్క కి రికమెండ్ చేయగా తాను అనుష్క కి నేరేట్ చేశానని చెప్పుకొచ్చారు అశోక్. అనుష్క భాగమతి పాత్ర పోషించటానికి ఒప్పుకున్న నాటి నుంచి తనలో డెడికేషన్ లెవెల్స్ చూసి ఆశ్చర్యపోతూనే వున్నానని కితాబిచ్చారు దర్శకుడు అశోక్.