ఇక్కడ హిట్... మరి అక్కడ

Update: 2017-09-23 07:06 GMT

రానా హీరోగా... తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ తెలుగులో ఆగష్టు 11 న రిలీజ్ టైమ్ కు తమిళ్ లో ధనుష్ సినిమా పోటీగా నిలవడంతో విడుదల చేయలేకపోయారు.అయితే అప్పుడు ఆగష్టు 11 న మిస్ అయినా నేనే రాజు నేనే మంత్రి తమిళ్ వెర్షన్ ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 22 న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు ఒక్క సినిమాతోనే పోటీ పడలేక తప్పుకున్నాడనుకున్న రానాకీ ఈసారి కూడా పోటీ తప్పలేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఏకంగా 8 మంది హీరోలు 8 సినిమాలతో రానా తో పోటీకి రెడీ అయ్యారు.

మరి ఆ 8 తమిళ సినిమాల మధ్య రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఒకేసారి ఇన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీకి దిగడంతో...... రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా టాక్ బయటకు రాలేదు. మరి ఈరోజు శనివారం ఈ సినిమా టాక్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది. కోలీవుడ్ లో ఈ సినిమా అద్భుతంగా ఆడాలంటే రెండు ఫ్యాక్టర్లు ఆ సినిమాకి కలిసి రావాలి. ఒకటి రానా నటించిన బాహుబలి మేనియా ఇంకా కొనసాగుతూనే రానా ఇమేజ్ తో నడవాలి. లేదంటే ఈ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ కాజల్ ఎప్పీయరెన్స్ తో అయినా ఈ సినిమా తమిళంలో దూసుకుపోవాలి. మరి ఈ రెండు తప్ప తమిళంలో ఈ సినిమా ఆడడానికి మరో రీజన్ లేదు.

మరి రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి తెలుగులో మంచి కలెక్షన్స్ తో హిట్ అనిపించుకుంది. మరి అదే జోరును తమిళంలోనూ కొనసాగిస్తుందో... లేదా ఆ 8 సినిమాల దెబ్బకి బలైపోతుందో అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.

Similar News