తెలుగులో పవన్ కళ్యాణ్ తో 'తీన్మార్', రామ్ సరసన 'ఒంగోలు గిత్త' లో నటించిన కృతి కర్బందాకి తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. తెలుగులో అవకాశాలు లేక కనీసం అక్క పాత్రలతో అయినా సెటిల్ అవ్వడానికి చేసిన 'బ్రుస్ లీ' సినిమా కూడా తేడా కొట్టడంతో దెబ్బకి అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది. రామ్ చరణ్ కి అక్కగా నటించిన 'బ్రుస్ లీ' చిత్ర పరాజయంతో ఏం చెయ్యాలో తోచక ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ బాలీవుడ్‌నే నమ్ముకొని ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది.
అయితే తెలుగులో పెద్దగా కలిసిరాకపోయినా కృతి కర్బందాకి బాలీవుడ్ కొంచెం పర్వాలేదనిపిస్తుంది. బాలీవుడ్ మూవీ ‘రాజ్ రీబూట్’లో నటించి మెప్పించిన కృతికి అక్కడ ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. తాజాగా కృతి కర్బందా ‘గెస్ట్ ఇన్ లండన్’లో లీడ్ రోల్ చేసింది. ఇప్పటికే కాస్త బిజీ తారగా మరీనా కృతికి ఇప్పుడు మరో బాలీవుడ్ ఆఫర్ వరించింది. డియోల్ సీరీస్ లో మూడో ప్రాజెక్ట్ అయిన ‘యమ్లా పగ్లా దివానా ఫిర్ సే’ లో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. సన్నీ డియోల్ - బాబీ డియోల్ ఫ్యామిలీ మూవీగా ఇప్పటికే ‘యమ్లా పగ్లా దివానా’ రెండు సినిమాలు వచ్చాయి.
ఈ సిరీస్‌లో రాబోయే మూడోది ‘యమ్లా పగ్లా దివానా ఫిర్ సే’. మరి డియోల్స్‌తో జతకడు తోన్న కృతి కర్బందా ఇక ఈదెబ్బకి బాలీవుడ్‌లోనే సెటిలైపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. చూద్దాం అమ్మడు తెలుగులో సక్సెస్ సాధించకపోయినా కనీసం బాలీవుడ్లోనైనా నిలదొక్కుకుంటుందేమో..?