బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న టబు, ఇటు టాలీవుడ్ కి సుపరిచుతురాలే. ఇక్కడ తెలుగులో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో జోడి కట్టిన ఈ భామ హైదరాబాద్ లో అప్పట్లోనే ఒక ఇల్లు కొనుక్కుంది. ఇక ఎలాగూ బాలీవుడ్ లేడీ కాబట్టి ముంబై లో కూడా ఒక ఫ్లాట్ కొనేసుకుని స్థిరపడిపోయింది. ఇక ఇక్కడ హైదరాబాద్ లోని ఇంటిని అద్దెకి ఇచ్చేసింది.
అయితే ఇప్పుడు ఈ భామ గోవా లో ఫేమస్ ఏరియాలో ప్రత్యేకంగా అపార్ట్మెంట్ లోని ఒక ప్లాటుని కొనుగోలు చేసిందట. టబు గోవాలో కొన్న ఆ అపార్ట్మెంట్ లోని ప్లాట్ రాజకీయనేతలు నివాసం ఉంటున్న అతి ఖరీదైన స్ట్రీట్ అంట. ఈ మధ్యనే టబు ఫ్రెండ్ ఆ ఏరియాలో ఉన్న ఒక పాత బంగళాని పడగొట్టి ఆ స్థలంలో ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టాడట. తన ఫ్రెండ్ కట్టిన అపార్టుమెంట్లోని సెకండ్ ఫ్లోర్ లోని ప్లాటునే టబు కొనుగోలు చేసిందట. అయితే ఆ ప్లాటు టబు ఊహలకు అనుగుణంగానే నిర్మిస్తున్నారట. ఇకపోతే ఆ ప్లాట్ లో స్విమ్మింగ్‌ఫూల్, లాంగ్ వాక్ చేయడానికి కూడా అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇక ఇన్ని సౌకర్యాలున్న ఆ ఇల్లు వచ్చే అక్టోబర్ చివరినాటికి పూర్తికావచ్చని అంటున్నారు.