నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ 'కథలో రాజకుమారి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కొత్త దర్శకుడు సూరపనేని మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుండే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ నాగ సౌర్య కూడా నటించడం. నారా రోహిత్, నాగ సౌర్యా ఇంతకుముందు 'జ్యో అచ్యుతానంద' అనే హిట్ చిత్రంలో బ్రదర్స్ గా నటించారు. ఇక ఇప్పుడు 'కథలో రాజకుమారి' చిత్రంలో నారా రోహిత్ ఎలా కనిపించబోతున్నాడో అనే విషయం మీద అభిమానులు కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే రోహిత్ ఈ మధ్యన బాగా బరువు తగ్గి చాలా సన్నగా స్టైలిష్ గా కనబడుతున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో నారా రోహిత్ కి జోడిగా నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్నది.
అయితే 'కథలో రాజకుమారి' కి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్, మాస్ట్రో ఇళయరాజా తో కలిసి ఈ చిత్రం కోసం మంచి మెలోడీలను అందిస్తున్నారు. 'కథలో రాజకుమారి' చిత్రంలో సంగీతం ఇప్పుడొక పాత సంగీత ప్రియులను కట్టిపడేస్తుంది. ‘నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేను’అనే సాంగ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేవాళ్లకు తెగ అలరించేస్తుంది. రాజకుమారి అందమైన చందమామ కథ చెబుతున్నట్టుగా సాగిపోయిన ఈ పాట చిత్రీకరణ మంచి లొకేషన్స్ లో చాలా ఆహ్లాదంగా జరిగిందని చెబుతున్నారు.
మరి పాటలతో ఇంతిలా అలరిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుండే భారీ అంచనాలని క్రియేట్ చేసింది. చూద్దాం సినిమా ఎలా వుండబోతుందో మరి కొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. అయితే నారా రోహిత్ ముగ్గురు యువ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న 'శమంతకమణి' చిత్రం మంచి విజయం సాధించింది. ఇపుడు 'కథలో...' కూడా హిట్ అయితే నారా రోహిత్ ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్టే అంటున్నారు.