ఇక ఎవరూ ఆపలేరేమో?

Update: 2017-10-18 14:00 GMT

సౌత్ లో హిట్టు కొట్టలేక బాలీవుడ్ కి చెక్కేసిన భామ తాప్సి. అక్కడ అడుగుపెట్టిన సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకుంది. తాప్సి బాలీవుడ్ లో నటించిన సినిమాలన్నీ పర్వాలేదనిపించాయి. దక్షిణాన పద్దతిగా... కొద్దిగా గ్లామర్ చూపించిన తాప్సి బాలీవుడ్ లో మాత్రం అడ్డు అదుపులేకుండా నటిస్తుంది. అక్కడ బికినీలతో రచ్చ చేస్తూ సౌత్ ని చిన్న చూపు చూడడమే కాదు.. ఇక్కడ దర్శకులకు గ్లామర్ చూపించడం తప్ప ఏం రాదనే స్టేట్మెంట్స్ ఇచ్చాక... మళ్ళీ నాలుక కరుచుకుని సారీ చెప్పింది అది వేరే విషయం. అయితే తాప్సి సారీ చెప్పింది.. ఎందుకంటే ఆనందోబ్రహ్మ సినిమా కి మంచి పబ్లిసిటీ కోసమే అని ప్రచారం జరిగింది. ఇక తాప్సి ఆనందోబ్రహ్మ హిట్ తో నేను దక్షిణాదిన కూడా మంచి సినిమాలే చేస్తానంటూ చెప్పుకొచ్చి బాలీవుడ్ కి ఫ్లైట్ ఎక్కింది.

ఇక తాప్సి బాలీవుడ్లో నటించిన జుడ్వా 2 చిత్రం మూడు వరాల క్రితమే విడుదలైంది. వరుణ్ ధవాన్ హీరోగా జాక్వెలిన్, తాప్సి లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మూడు వరాల క్రితమే విడుదలై దాదాపు 200 కోట్లకు పైబడే గ్రాస్ సాధించి ఈ ఏడాది బడా ప్రాజెక్టులుగా విడుదలైన చిత్రాలకు చుక్కలు చూపించింది. చిన్న సినిమాగా.. మీడియం బడ్జెట్ హీరో అయిన వరుణ్ తో అయన తండ్రి డేవిడ్ ధవాన్ తెరకెక్కించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరికొంత కలెక్షన్స్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్ తో తాప్సి ని ఆపాలేరేమో..

ఈ సినిమాలో తాప్సి బికినీ షో మాములుగా లేదు. అందులోను ఈ సినిమా హిట్ టాక్ తో బాలీవుడ్ లో తాప్సి పాతుకుపోయినట్టే అంటున్నారు. ఇక ఈ భామకు బాలీవుడ్లో తిరుగులేదని... అలాగే దక్షిణాదిన ఇక తాప్సి సినిమాలు మానేస్తుందనే టాక్ కూడా నడుస్తుంది. ఇకపోతే తాప్సి మాక్సిమ్ మేగజైన్ కోసం మాగ్జిమమ్ అందాలు ఆరబోసి హైలెట్ అయ్యింది. ఈ మ్యాగజైన్ కోసం తాప్సి బికినీ షోనే కాకూండా క్లివేజ్ అందాలతో సెగలు రేపుతోంది. ఎంతైనా బాలీవుడ్ మహిమే అంటున్నారు.

Similar News