ఇంత చెబుతుంది... ఏం లేదంటుంది?

Update: 2018-03-04 05:49 GMT

అఖిల్ తో కలిసి వెండితెరకు హలో అంటూ పరిచయమైన ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ఆ సినిమా యావరేజ్ టాక్ తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమాలో క్యూట్ లుక్స్ తోపక్కింటి అమ్మాయిలా ఆకట్టుకున్న కళ్యానికి హలో సినిమా తర్వాత ఓ... అన్నంత ఆఫర్స్ ఏం రాలేదు. హలో సినిమాలో ఆమె లుక్స్ ని పొగిడినవారే... ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇచ్చే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. అయితే తాజాగా సినిమాలకు పరిచయమైన కళ్యాణి మీద హలో సినిమా విడుదలకు ముందు నుండే ప్రేమ పెళ్లి వార్తలు ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేశాయి.

మల్లువుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో కళ్యాణి డీప్ లవ్ లో ఉందని... పెద్దల నిశ్చయంతో వారిద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని కూడా అన్నారు. కళ్యాణ్, ప్రణవ్ ల పెళ్లిని కళ్యాణి తల్లి తండ్రులు, ప్రణవ్ తల్లి తండ్రులు ఇరువురు పాజిటివ్ గా ఉన్నారని కూడా అన్నారు. అయితే అప్పుడెప్పుడో వచ్చిన వార్తలకు ఇప్పుడు కళ్యాణి క్లారిటీ ఇస్తుంది. మోహన్ లాల్ కుమార్తె' విస్మయ తన బ్రదర్ ప్రణవ్ ఫోటో ని కల్యాణికి పంపగా... ఆ పిక్ ని కళ్యాణి తన పేరెంట్స్ తో షేర్ చేసిందట. ఇక ఆ ప్రణవ్ పిక్ ని చూసిన కళ్యాణి తల్లి ప్రణవ్ తల్లికి చూపించి కళ్యాణి, ప్రణవ్ లు ఇద్దరు ఇష్టపడుతున్నారేమో అని చెప్పిందట. అలా అలా తమ పెళ్లి పుకార్లు బయలుదేరాయని చెబుతుంది. అంతేకాని మా మధ్యన పెళ్లి, ప్రేమ లాంటివి ఏం లేవంటుంది కళ్యాణి.

ఆలా ప్రేమపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కళ్యాణి పనిలో పనిగా ప్రణవ్ ఇష్టా ఇష్టాలను కూడా చెప్పేస్తుంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కి అసలు స్టార్ కొడుకుని అనే ఫీలింగ్ ఉండదట. అతని ఎక్కడికి వెళ్లిన కేవలం 500 రూపాయల్తోనే ప్రయాణం చేస్తుంటాడట. అలాగే అవసరమైతే లారీ ప్రయాణం కూడా చేస్తాడట. మరి ప్రణవ్ గురించి అన్ని చెప్పిన కళ్యాణి మనసులో ఏం లేదంటే నమ్మాలా.?

Similar News