ఇంటరెస్టింగ్ రేట్ కు హలో సినిమా శాటిలైట్ రైట్స్

Update: 2017-12-17 15:26 GMT

మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెండో సినిమాపై ఫుల్ డెడికేషన్ పెట్టి హలో సినిమాను రెడీ చేసాడు అఖిల్. ఈ సినిమా ఈ క్రిస్మస్ కు రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు సినిమా 5కోట్ల 90లక్షల రూపాయలకు దక్కించుకుంది.

ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ ఇంత మొత్తంలో రావడం చెప్పుకోదగ్గ విషయమే. సినిమా రిలీజ్ అవ్వకుండానే జీ సినిమా డీల్ సెట్ చేసుకుంది. అఖిల్ మొదటి సినిమా కూడా జీ తెలుగు వాళ్లే కొన్నారు. అది డిజాస్టర్ అయినా మళ్ళీ వీళ్ళే కొనడానికి కారణం నాగార్జున అంట. అఖిల్ సినిమా ప్లాప్ అవ్వడంతో టీవీల్లో కూడా రేటింగ్ రాలేదు అందుకు నాగ్ హలో సినిమా కూడా ఆ ఛానల్ కు ఇచ్చాడట.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 29కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖర్చులన్నీ కలుపుకొని కనీసం 33 కోట్ల రూపాయలు రావాలి. మరి అఖిల్ కు అంత మార్కెట్ కూడా లేదు. అందుకే నాగ్ ఈ సినిమా ప్రొమోషన్స్ యూఎస్ నుండి స్టార్ట్ చేసి అక్కడ వసూళ్ల కోసం ఓవర్సీస్ పై ఎక్కువ ద్రుష్టి పెట్టటానికి కారణం

Similar News