గతంలో సంపత్ నంది - మెగా హీరో రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన రచ్చ చిత్రం కమర్షియల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సంపత్ నంది పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేద్దామనుకుని భంగపడిన తర్వాత రవితేజ, గోపీచంద్ లతో సినిమాలు చేసాడు. మధ్య మధ్యలో రామ్ చరణ్ త్ టచ్ లో ఉంటూనే యేవో కథలు కూడా వినిపిస్తున్నాడట సంపత్ నంది. అసలు రచ్చ చిత్రం ముందు సంపత్ కి మంచి ట్రాక్ రికార్డ్ లేదు. కానీ రచ్చ స్టోరీ నచ్చడంతో రామ్ చరణ్ సంపత్ నందికి అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు.
సంపత్ నంది గోపీచంద్ తో గౌతమ్ నందా చిత్రం తెరకెక్కించిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలనే పట్టుదలతో మంచి కథలు ప్రిపేర్ చేస్తూ చరణ్ తో రెగ్యులర్ గా టచ్ లో వుంటున్నాడట. అయితే సంపత్, చరణ్ ని డైరెక్ట్ చెయ్యాలి అంటే గనక గౌతమ్ నందా సినిమా విడుదలైన తర్వాత దానికొచ్చే రెస్పాన్స్ ని బట్టే రామ్ చరణ్ తో ఛాన్స్ ఉంటుందని ఒకవేళ గౌతమ్ నందా చిత్రం టాక్ అటో ఇటో అయితే ఇక సంపత్, చరణ్ మీద పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు.
ఇకపోతే సంపత్ డైరెక్షన్ లో తెరకెక్కిన గౌతమ్ నందా ఈ శుక్రవారమే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.... ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవచ్చనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. మరి సంపత్ నంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ గౌతమ్ నందా రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది గనక ఈ చిత్రానికి టాక్ ఎలాఉన్నా కలెక్షన్స్ బావుంటేనే రామ్ చరణ్ చిత్రం చేయగలుగుతాడు. లేకుంటే ఖాళీ. ఇక రామ్ చరణ్ ప్రస్తుతానికి సుకుమార్ డైరెక్షన్ లో రంగ స్థలంలో నటిస్తూనే తన తండ్రి 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక హీరోగా సుకుమార్ చిత్రం కంప్లీట్ కాగానే కొరటాల డైరెక్షన్ లో మరో మూవీకి కమిట్ అయిన చెర్రీ, సంపత్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడో లేదో అనేది మాత్రం కాస్త సస్పెన్స్ అంటున్నారు.