ఆవిడెలా ఉంటే... ఈవిడకేందుకో!!

Update: 2017-07-25 03:16 GMT

1 నేనొక్కడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ కృతి సనన్... మహేష్ పక్కన నటించినా.... సరైన అవకాశాలు లేక బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్ లో కృతి సనన్ చేతికందిన సినిమాల్లో చేస్తూ బిజీగా వుంది. ఆమె తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి నటించిన రాబ్తా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. రాబ్తా సినిమా ఫలితం ఎలా వున్నా అందులో నటించిన సుశాంత్ రాజపుత్ తో కృతి సనన్ ఎఫ్ఫైర్ నడుపుతుందని మాత్రం బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఇప్పుడు కృతి సనన్ ఆయుష్మాన్ ఖురానా తో జంటగా నటించిన బరైలీ కీ బర్ఫీ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.... టైగర్ ష్రాఫ్ - సల్మాన్ ఖాన్ తోనూ నటిస్తోంది.

మరి అక్కడ గ్లామరస్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని బిజీ అయిన కృతిపై బాలీవుడ్ నటి భైరవి గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసింది. కృతి సనన్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ట్విట్టర్ లో ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయింది. అసలు ఆమె యాక్టర్ ఎలా అయ్యిందో..... హెడ్ లైట్ లేదు.. బంపర్ లేదు. కాలేజ్ స్టూడెంట్స్ ఆమెకన్నా చాలా బెటర్ గా కనిపిస్తారు అంటూ ట్విట్టర్ సాక్షిగా కృతి ని ఇన్సల్ట్ చేస్తూ చెలెరేగిపోయింది. మరి ఇలా కృతి సనన్ మీద నటి భైరవి గోస్వామి ఇన్సల్టింగ్ కామెంట్స్ పోస్ట్ చేయడంపై నెటిజన్లు అగ్రహారం వ్యక్తం చేసున్నారు.

Similar News