ఆయనకు ఎలాంటి సర్టిఫికెట్ రానుందో..?

Update: 2017-08-10 11:27 GMT

నిమాల్లో హీరోలు బూతులు మాట్లాడడం అనేది అన్ని లాంగ్వేజెస్ లో ఉన్న కామన్ పాయింట్. అలా హీరోలు బూతులు మాట్లాడుతుంటే కుర్చీల్లో కూర్చున్న అభిమానాలు మాత్రం విజిల్స్ వేస్తూ వీరంగం ఆడుతుంటారు. అయితే చిన్న చిన్న బూతు పదాలను మాత్రమే ఉంచుతూ బాగా ఉన్న బూతు పదాలను మాత్రం సెన్సార్ వారు నిర్ధాక్షిణ్యంగా కట్ చేసి పేడేస్తారు. అయితే సెన్సార్ బోర్డు తీసేసిన ఆ పదాలను కొన్ని టెక్నికల్ సమస్యలు వలన మనకు వినపకుండా చేస్తారు కూడా. అయితే అలా వినపడకుండా చేసినా కూడా మనకు అర్ధమవ్వాల్సినవి అర్ధమవుతూనే ఉంటాయి అది వేరే విషయం.

అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డు బాలకృష్ణ 'పైసా వసూల్' విషయంలో కొన్ని ఆంక్షలు విధించినట్టు ప్రచారమవుతుంది. పూరి - బాలయ్య కాంబోలో రాబోతున్న 'పైసా వసూల్' చిత్రం స్టంపర్ లో బాలకృష్ణ ఒక ఫైట్ సీన్ లో నిజ జీవితంలో బూతుగా పరిగిణించిన ఒక సైగను వాడాడని..... ఇప్పుడు ఈ విషయంగానే సెన్సార్ వాళ్ళు 'పైసా వసూల్' చిత్ర యూనిట్ కొన్ని సూచనలు ఇచ్చారు అని చెబుతున్నారు. సినిమాలో అలా ఉన్న సైగలను తొలిగిస్తేనే సినిమా కు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అని వారు చెప్పినట్టు చెబుతున్నారు. అలాగే 'పైసా వసూల్' లో ఇప్పటికే కొన్ని కత్తిరింపులు కూడా జరిగాయి అని తెలుస్తుంది.

మరి మాఫియా డాన్ గా, గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న బాలకృష్ణ ఒక చూపుకే సెన్సార్ అభ్యంతరం చెబుతుంటే డాన్ గా బాలయ్య కొన్ని బూతులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ బూతు డైలాగ్స్ అన్నింటీని సెన్సార్ కట్ చేసేస్తే సినిమాలో కిక్కేముంటుందంటున్నారు నందమూరి అభిమానులు. అసలు పూరి డైరెక్షన్ లో మూవీ అంటే మనం నిజ జీవితంలో మాట్లాడుకునే కొన్ని బూతులు సినిమాలో వినబడుతూనే ఉంటాయి. చూద్దాం సెన్సార్ బోర్డు సెప్టెంబర్ 1 న విడుదల కాబోయే' పైసా వసూల్' కి ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వనుందో...

Similar News