పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి, విడాకులు అంతా ఒక కలలాగా జరిగిపోయిందంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చింది. ఇప్పటికి పవన్ తో పిల్లల కోసం సత్సంబందాలు కొనసాగిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో మాత్రం రేణు దేశాయ్ ఇప్పటికి సఫర్ అవుతూనే ఉంది. ఈ విషయం అనేక ఇంటర్వూస్ లో ఆమె అందరికి తెలిసేలా చేసింది కూడా. గతం వద్దు మరిచి పోవాలి అంటూనే అప్పుడప్పుడు జ్ఞాపకాలు మాత్రం వదలకుండా అందరితో పంచుకుంటూనే ఉంది. పవన్ మీద తనకి చేదు అభిప్రాయం లేదని గొంతెత్తి చెప్పినా పవన్ అభిమానులు మనసుతో ఆలోచించడం లేదు. రేణు మీద ఎప్పటికప్పుడు ఒంటికాలుమీద లేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా రేణు దేశాయ్ యూట్యూబ్ లో ఉంచిన ఒక వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ వీడియో ద్వారా తన మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన రేణు దేశాయ్ అందులో పవన్ కళ్యాణ్ గురించే ప్రస్తావించింది. కొందరి సందేహాలకు బలం చేకూర్చేలా రేణు దేశాయ్ మాటలు ఉండటం గమనార్హం. తను, గతంలో ఆయన మాటలు, పదాలు, సిరా గుర్తులు ఒకసారి చూసుకుంటున్నానని, మంచులా కరిగిపోయింది అనుకున్న ఆ గతం మళ్ళి ఇప్పుడు కళ్ళ ముందు కదులుతూ ఉంటే రాసుకున్న లేఖల ముక్కలు, పగిలి ముక్కలైన హృదయం మాత్రమే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
మరి ఆ వీడియో లో పవన్ పేరు వాడకపోయినా.. రేణు దేశాయ్ పవన్ విషయంలో ఎంతెలా నలిగిపోయిందో అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. రేణు దేశాయ్ జీవితంలో అంత బలంగా ప్రభావం చూపించిన వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. డాలర్-ఎ ఫిగర్ అఫ్ స్పీచ్ పేరుతో రేణు జస్ట్ నిమిషం పాటున్న ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం సూటిగానే చెప్పేసింది. మరి రేణు దేశాయ్ ఇలా పవన్ పేరెత్తకుండా ఆయన అనే పదం వాడినప్పటికీ.. మరి ఆయన ఫ్యాన్స్ ఎలాంటి రియాక్షన్ చూపిస్తారో అనేది మాత్రం ఇప్పుడు అసలైన హాట్ టాపిక్.