ఆయన నోట్లో నోరు పెడితే... అంతే

Update: 2017-10-13 20:30 GMT

రామ్ గోపాల్ వర్మ నోట్లో నోరు పెడితే ఎలా ఉంటుందో చాలా ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నాము. మొన్నటివరకు మెగా ఫ్యామిలీతో ఆటలాడిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు టిడిపి నేతలతో ఆడుకుంటున్నాడు. నందమూరి ఫ్యామిలీతో పెట్టుకోవడమే కాక టిడిపి నేతలతో పెట్టుకుని మరి నెగ్గుకొస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం వంటిదని అందులోని ఒక భాగం అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్నాని ప్రకటించడం.. టిడిపి నేతలు గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్టుగా వర్మ మీద రాళ్ళేయ్యడం మొదలుపెట్టారు. వర్మ వదులుతాడా వారికీ ధీటుగా జవాబులిస్తున్నాడు.

రాజేంద్ర ప్రసాద్, సోమిరెడ్డి, అనిత ఇలా టిడిపి నేతలకు కౌంటర్ కి కౌంటర్ ఇచ్చిన వర్మ తాజాగా వాణి విశ్వనాధ్ ని ఆడుకున్నాడు. వాణీ విశ్వనాథ్ మాజీ హీరోయిన్. ఈ మధ్యనే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాణీ విశ్వనాథ్ అటు రాజకీయాలవైపు మొగ్గు చూపడం... ఆమెకి టిడిపి వల వెయ్యడం చాకచాకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు టిడిపి నేతగా వాణీ విశ్వనాథ్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ఎన్టీఆర్ పై విరుచుకు పడింది. ప్రజలు దేవుడిగా కొలిచే ఎన్టీఆర్ ని ఇష్టం వచ్చినట్టు సినిమాలో చూపిస్తే ఊరుకోమని.... ఒకవేళ మొండిగా సినిమా తీస్తానని ముందుకు వెళ్తే తాము ఊరుకునేది లేదని వాణి విశ్వానాధ్ హెచ్చరించింది. ఈ సినిమా మొదలు పెడితే వర్మ ఇంటిముందు ధర్నా చేస్తామని కూడా బెదిరిస్తోంది. ప్రజలు ఎన్టీఆర్ లోనే రాముడిని, కృష్ణుడిని చూసుకుంటున్నారని.. అలాంటి వ్యక్తిపై గొప్పగా సినిమా తీస్తే ఎవరికీ అభ్యంతరాలు లేవని... ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా సినిమా తీసి ఎన్టీఆర్ ని అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. అసలు వర్మ తీయబోయే సినిమాపై చాలా అనుమానాలున్నాయని.. దురుద్దేశంతోనే వర్మ ఈ సినిమా తీయాలనుకుంటున్నాడని వాణి విశ్వనాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

మరి వాణి విశ్వనాద్ అలా అంటే వర్మ ఎందుకు ఊరుకుంటాడు.. వెంటనే లైన్లోకొచ్చి తానేమి తప్పు చెయ్యడం లేదని.... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే నా ఇంటిముందు ధర్నా చేస్తానని వాణి గారు చెబుతున్నారు. నాకసలు ఇల్లే లేదు... నేనే రోడ్ల మీద తిరుగుతుంటాను. మరి ఆవిడ నన్ను పట్టుకోవడానికి రోడ్డుమీదకొస్తే ఆవిడకాళ్ళు కందిపోతాయంటూ వెటకారంగా కౌంటర్ వేసాడు. మరి ఎవెరెన్ని మొరిగినా నేను గట్టిగా మొరగగలంటూ వర్మ ఏమాత్రం తగ్గడం లేదు.

Similar News