ఆయన ఆక్కడినుండి రారట!!

Update: 2017-07-27 11:00 GMT

టాలీవుడ్ ని డ్రగ్స్ రాకెట్ ఒక కుదుపు కుదిపి పడేస్తుంది. వరుసగా సెలబ్రిటీస్ కి నోటీసులిచ్చిన సిట్ అధికారులు వారిని విచారించి డ్రగ్స్ వ్యవహారంలోలోతుపాతులని సమీక్షిస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీస్ గా చలామణి అవుతున్న 12 మందిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పూరి, సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు, ఛార్మి, తరుణ్, నవదీప్, చిన్నా లను విచారించిన సిట్ అధికారులు వారి దగ్గరనుండి విలువైన సమాచారాన్ని రాబట్టారని ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి ఉన్నపళంగా బయటికి వచ్చిన ముమైత్ ఖాన్ కూడా ఈ రోజు గురువారం సిట్ ముందు విచారణకు హాజరైంది.

ఇక ఇప్పటివరకు విచారణ ఒక ఎత్తు, రేవు శుక్రవారం రవితేజ విచారణ ఒక ఎత్తు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు డ్రగ్స్ మాఫియాతో సంబంధం లేదని మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ రవితేజ మాత్రం ఇప్పటిబివరకు డ్రగ్స్ విషయంలో నోరెత్తకుండా కిమ్మునుండిపోయాడు. ఆయనగారి తల్లి రాజ్యలక్ష్మి మాత్రం తన కొడుక్కి ఏ పాపం తెలియదని... అసలు డ్రగ్స్ వాడడని మీడియాతో చెప్పుకొచ్చింది. కానీ రవితేజనుండి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఇకపోతే సిట్ ముందు హాజరవడానికి గాను రవితేజ రాజా ది గ్రేట్ షూటింగ్ నుండి హైదరాబాద్ చేరుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

రేపు శుక్రవారమే రవితేజ విచారణ జరగబోతుండడంతో రవితేజ దానికోసమే షూటింగ్ కి బ్రేకిచ్చి ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే రవితేజ శుక్రవారం తన ఇంటినుండి సిట్ ఆఫీస్ కి బయలుదేరకుండా మరో ప్రదేశం నుండి అక్కడికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే మీడియా ఫోకస్ మొత్తం రవితేజ మీదే ఉంటుందని గ్రహించి ఉదయాన్నే ఇంటినుండి బయటికి వెళ్ళిపోయి అక్కడ నుండే సిట్ ఆఫీస్ కి రవితేజ రావొచ్చని చెబుతున్నారు. ఇకపొతె ఈ డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకుని విచారణకు హాజరైన పురుషులంతా తెల్ల చొక్కాలే ధరించి సెంటిమెంట్ గా సిట్ కార్యాలయానికి వచ్చారు. మరి రవితేజ కూడా వైట్ సెంటిమెంట్ ని ఫాలో అవుతాడో లేదో అనేది రేపు శుక్రవారం ఉదయమే క్లారిటీ వస్తుంది.

Similar News