ఆమెను డైరెక్ట్ చెయ్యలేనంటున్నాడు!!

Update: 2017-07-18 09:00 GMT

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 'బాహుబలి' లో చేసిన శివగామి పాత్రకు ఆమె విపరీతంగా కీర్తి ప్రతిష్టలు వచ్చేసాయి. అసలు శివగామిగా మరొకరిని ఆ అపాత్రలో ఉహించడానికి వీలులేకుండా రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఒకప్పుడు 'నరసింహా' చిత్రంలో రమ్యకృష్ణ కి ఎంతటి పేరొచ్చిందో అంతకంటే ఎక్కువ 'బాహుబలి' లో శివగామి పాత్రకి పేరొచ్చింది. మరి శివగామిగా వేయినోళ్ల కొనియాడుతున్న ఆమె నటన గురించి రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ మాత్రం ఇంతవరకు తన స్పందన తెలియజేయలేదు.

అయితే ఇప్పుడు కృష్ణవంశీ తాను డైరెక్ట్ చేసిన 'నక్షత్రం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన భార్య రమ్యకృష్ణ కి తన సినిమాల్లో ఎటువంటి పాత్ర ఇవ్వనని సంచలనంగా మాట్లాడాడు. 'బాహుబలి’ చిత్రంలో రమ్య నటన చాలా అద్భుతంగా వుంది. అయితే శివగామిగా రమ్యకృష్ణ అంతలా మెప్పించడానికి కారణం రచయిత, దర్శకుడే అంటున్నాడు కృష్ణవంశీ. ఆ క్యారెక్టర్‌ను అంత బాగా రాశారు. రమ్య మంచి నటి అని ‘అమ్మోరు’, ‘నరసింహ’ సినిమాలతోనే నిరూపించుకుంది. అయితే నేను మాత్రం రమ్యని డైరెక్ట్‌ చేయలేను. ఎందుకంటే ఆమె నా భార్య గనక ఆమెను ఓ ఆర్టిస్టుగా చూడలేను. మా బంధం వ్యక్తిగతమైంది. అందుకే ఆమెను నా సినిమాల్లోకి తీసుకోనని చెప్పాడు కృష్ణవంశీ.

Similar News