చాలా మంది హీరోయిన్స్ మన టాలీవుడ్ సినిమాలలో పేరు తెచ్చుకుని బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి... ఇక్కడ టాలీవుడ్ ని కించపరిచేలా మాట్లాడటం ఇప్పుడు ట్రెండ్ అయింది. సౌత్‌లో పలు సినిమాల్లో నటించి, స్టార్‌డమ్ సంపాదించుకుని, బాలీవుడ్‌కి వెళ్ళాక సౌత్ సినిమాల్ని ఎగతాళి చేయడం చాలామందికి అలవాటే. ఇలియానా, రాధికా ఆప్టే, తాప్సీ వీరు కూడా ఆ కోవకి చెందినవారే. సౌత్ సినిమాలలో ఎక్స్‌పోజింగ్‌కే ఎక్కువ ప్రయార్టీ ఇస్తారని.. సౌత్ సినిమా పై చేసిన విమర్శలు గురించి మనకి తెలిసినవే.
ఇదిలా ఉండగా కొత్తగా బాలీవుడ్ బుల్లి తెరకి కి చెందిన ఓ బామ్మ కూడా మన సౌత్ సినిమాలని ఎగతాళి చేసి మాట్లాడి.. మన సౌత్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. అయితే దానికి ఘాటుగా సౌత్ ముద్దు గుమ్మ 'హన్సిక మోత్వానీ' కౌంటర్ ఇచ్చింది. తెలుగులో 'దేశముదురు' ఆమెకి హీరోయిన్‌గా తొలి సినిమా. నిజానికి బాల నటిగా బాలీవుడ్‌లోనే ఆమె ముందుగా నటించేసింది. హీరోయిన్‌గా ఒకటీ అరా బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతానికి తమిళ సినీ పరిశ్రమలో సెటిలైపోయింది హన్సిక.
'మా సౌత్ సినిమాని విమర్శించే నైతిక హక్కు నీకెక్కడిది.? సిగ్గుండాలి విమర్శించడానికి..' అంటూ హన్సిక విరుచుకుపడ్డతీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఎప్పుడూ సోషల్ మీడియా తో టచ్ లో వుండే హన్సిక...బాలీవుడ్ బుల్లితెర నటిపై విరుచుకుపడటంతో... ఇక్కడి సౌత్ ప్రేక్షకులు ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. హన్సిక కస్సుబుస్సులాడడంలోనూ అర్థం లేకపోలేదు. ఎక్స్‌పోజింగ్‌కి టాలీవుడ్ ఏంటి.? కోలీవుడ్ ఏంటి.? బాలీవుడ్ ఏంటి.? బాలీవుడ్‌లో వచ్చినట్లుగా 'అడల్ట్ రేటెడ్ కంటెంట్‌తో' మన సౌత్ సినిమాలలో రాగలవా.?