దిల్ రాజు సమర్పణలో బి వి ఎస్ ఎం ప్రసాద్ నిర్మాతగా... వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన తొలిప్రేమ ఏపాటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా వచ్చిన ఈసినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో ముందు రాశి ఖన్నా ని హీరోయిన్ గా డైరెక్టర్ వెంకీ ఎంపిక చేసినప్పుడు నిర్మాత దిల్ రాజు భయపడ్డాడట. ఎందుకంటే రాశి ఖన్నా గత సినిమాల్లో పెద్దగా స్కోప్ ఉన్న పాత్రల్లోగాని.. అలాగే సిల్లీ కేరెక్టర్ ని మాత్రామే చేసింది కాబట్టి... ఈ తొలిప్రేమ సినిమాలో రాశి ఖన్నాని తీసుకోవడం క్లారెక్ట్ కాదనుకున్నాడట. ఆ విషయాన్ని దిల్ రాజే స్వయంగా నిన్న జరిగిన తొలిప్రేమ సక్సెస్ మీట్ లో బయటపెట్టాడు.
మొదట్లో వెంకీ అట్లూరి... రాశి ఖన్నా ని వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే ఆమె ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యత ఉన్న కేరక్టర్స్ చెయ్యలేదు... కేవలం సిల్లీ పాత్రల్లోనే మెరిసింది. మరి ఈ సినిమాలో చెయ్యాలంటే బాగా కష్టపడాలి... అందుకే వెంకీ సెలక్షన్ తప్పు అనుకున్నానని చెప్పాడు. కానీ తొలిప్రేమ సినిమా చూసాక వర్ష పాత్రలో రాశి ఖన్నా అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చిందని... వర్ష పాత్రలో ఒదిగిపోయి నటించిందని.... వర్ష పాత్రకు రాశి ప్రాణం పోసిందని... వర్ష పాత్రలో చాలా పరిణీతి గల అమ్మాయిలా రాశి పెరఫార్మెన్స్ అదుర్స్ అని... ముందు రాశి గురించి నేను తప్పుగా ఆలోచించానని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.