ఆమె వెనుక ఉన్నది ఎవరు?

Update: 2018-02-15 09:07 GMT

నితిన్ తో కలిసి నటించిన లై సినిమా ప్లాప్ అయినా మళ్ళీ వెంటనే నితిన్ మరో అవకాశం ఇచ్చాడు మేఘ ఆకాష్ కి. లై సినిమాలో అమ్మడు క్యూట్ లుక్ తో మంచి నటనతో ఆకట్టుకున్నా ఆ సినిమా డిజాస్టర్ వలన మేఘ ఆకాష్ కి పెద్దగా పేరు లేకుండా పోయింది. మరి మేఘ నటనకు మెచ్చో... లేదా అందానికి ముగ్దుడయ్యో గాని... నితిన్ తన తదుపరి సినిమాకి కూడా మేఘ ఆకాష్ నే హీరోయిన్ గా తీసుకున్నాడు. మరి మొదటి సినిమా ప్లాప్ అందుకున్న రెండో సినిమా కూడా భారీ బడ్జెట్ ఉన్న సినిమానే చేస్తున్న మేఘ మరో భారీ బడ్జెట్ సినిమాలో ఎంపికైందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోలీవుడ్ లో రెండేళ్ల క్రితం విడుద‌లై సూప‌ర్ హిట్ కొట్టిన క‌నితాన్‌ సినిమాని.... త‌మిళ ద‌ర్శ‌కుడు టీఎన్ సంతోష్ తెర‌కెక్కించాడు. అయితే ఇప్పుడు అదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్నారు. మరి నిఖిల్ కి జోడిగా ఈ సినిమా లో ఎవరు నటిస్తారో అని అనుకున్నారు అంతా... ముందుగా తమిళ క‌నితాన్‌ లో నటించిన కేథరిన్ నే తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఆ ఛాన్స్ తనని దాటి పోదని కేథరిన్ కూడా కలలు కనింది. కానీ కేథరిన్ కాదని నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ ని నిఖిల్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసారనే టాక్ బయటికి వచ్చింది.

మరి ఒకే ఒక్క సినిమా తో మళ్ళీ ఇలాంటి బిగ్ ఆఫర్ మేఘ ఆకాష్ పట్టెయ్యడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే మేఘ ఆకాష్ కి ఈ బడా ఆఫర్ రావడానికి వెనుక ఒక హీరో అస్తం ఉందనే ప్రచారం మొదలైంది. ఆ హీరో అండదండలతోనే మేఘ ఆకాష్ నిఖిల్ పక్కన ఈ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ నడుస్తుంది. మరి ప్లాప్ హీరోయిన్ కి ఇలా వరుసబెట్టి అవకాశాలు వస్తుంటే ఎవరైనా ఇదే నిజమనుకుంటారు. అదేమిటంటే మేఘ ఆకాష్ వెనుక ఎవరో ఉన్నారని.

Similar News