ఆమె నా ఫ్రెండ్ మాత్రమే .... ఆమెతో ఎఫ్ఫైర్ లేదంటున్న హీరో?

Update: 2018-03-15 15:52 GMT

కోలీవుడ్ లో నిజజీవితంలో రసికత నిండిన హీరో ఎవరయ్యా అంటే వెంటనే శింబు అంటారు. ఎందుకంటే కోలీవుడ్ లో హీరో శింబు నడిపిన ప్రేమాయణాలు అలాంటివి మరి. కోలీవుడ్ లో ఏ హీరోయిన్ టాప్ లో ఉన్నాసరే శింబు ఆమెతో ఎఫ్ఫైర్ పెట్టుకుంటాడని అంటారు. అసలు మొదట్లో శింబు నయనతార ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటారన్నారు. ఆ తర్వాత శింబు హన్సిక తో లవ్ ఎఫ్ఫైర్ నడపడమే కాదు... ఆమెతోను పెళ్ళికి సిద్ధపడ్డాడు. కానీ హన్సిక కే ఏమైందో ఏమో తెలియదు గాని సైలెంట్ గా శింబు లైఫ్ నుండి తప్పుకుంది.

అయితే హన్సిక కన్నా ముందే శింబు హీరోయిన్ త్రిషతో కూడా ప్రేమాయణం నడిపాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే శింబు త్రిషతో ప్రేమాయణం నడిపాడనే టాక్ ఉంది. ఎందుకంటే వారిద్దరూ కలిసి నటించిన విన్నైతాండి వరువాయా సూపర్ హిట్ అవడం కూడా వారిద్దరి మధ్యన ఏదో ఉందనే పుకారు రావడానికి కారణం. కేవలం శింబు, త్రిషల మధ్య ఎఫ్ఫైర్ ఉందనేది పుకారో లేకపోతే నిజమో కరెక్ట్ గా క్లారిటీ లేదుగాని... త్రిష కి మాత్రం అటు కోలీవుడ్ లోను, టాలీవుడ్ లోను ఇద్దరు హీరోలతో లవ్ ఎఫ్ఫైర్స్ ఉన్నాయంటారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా శింబు, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం మరోమారు హాట్ టాపిక్ అయ్యింది.

వారిద్దరూ గతంలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఆ సినిమా సీక్వెల్ విషయంలో శింబు మీడియాతో మాట్లాడేటపుడు తనకి త్రిషకు ఎలాంటి లవ్ ఎఫ్ఫైర్ లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. గతంలో తనకి త్రిషకి మధ్యన ప్రేమాయణం కొనసాగిందంటూ జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని చెప్పడమే కాదు.... తనకి త్రిష చిన్నప్పటి నుంచీ తెలుసనీ .. కేవలం ఆమెతో తనకి స్నేహం మాత్రమే ఉందని... ప్రేమ గీమా లాంటివి లేవని స్పష్టం చేశాడు.

Similar News