ఆదా అందాలు మరోసారి

Update: 2017-11-30 11:00 GMT

హార్ట్ ఎటాక్ తో జనాలకు హార్ట్ ఎటాక్ తెప్పించిన ఆదా శర్మ ఇప్పుడు అందాల ఆరబోతలో అదరగొడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రకరకాలుగా ట్రై చేస్తున్న ఆదాను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. కనీసం హీరోయిన్ ఛాన్స్ ఏమోగానీ సైడ్ కేరెక్టర్స్ ఇచ్చేవారు లేకుండా పోయారు. అందుకే మా టీవీ లో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ అనే డాన్స్ షోకి జడ్జ్ గా వెళుతుంది. అయితే అమ్మడు అటు ఎయిర్ పోర్ట్ లోను... ఇంకేదన్న ఫంక్షన్స్ లోను అదిరిపోయే అందాలు ఆరబోస్తూ దర్శక నిర్మాతలకు వల వేస్తుంది.

ఇప్పుడుకూడా తాజాగా ఆదా శర్మ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ అందరికి హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది. ఇంతకుముందు ఇచ్చిన ఫొటోస్ తో నార్మల్ గా రెచ్చిపోయిన ఆదా ఇప్పుడు మాత్రం వైట్ షర్ట్ లో లేలేత అందాలను ఘాటుగా చూపించేసింది. ఇక అమ్మడు వేసుకున్న స్కర్ట్ కూడా చాలా వెరైటీ గా ఉంది. అసలు మరీ ఇంత ఘాటుగా ఫోటోకి ఎందుకు ఇచ్చిందో గాని ఇప్పుడు కుర్రకారు ఫొటోను తెగ షేర్ చేసుకుంటున్నారు. అంతలా వుంది ఆదా శర్మ ఫోటో. అమ్మడు ఎంతగా అందాల ఆరబోతలో కష్టపడినా ఫలితం శూన్యం అనేలా వుంది పరిస్థితి.

Similar News