నిరంతరం తాను చేపట్టే వైవిధ్యమైన కార్యకలాపాలతో వివాదాల్లో, వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా తాను రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తో గత కొద్దీ రోజులుగా అన్ని టెలివిజన్ చానెల్స్ లో మహిళా సంఘాల నేతలతో వాదోపవాదాలు జరుపుతూ తాను గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ రూపొందించిన కారణం ఆడవారిని కించపరచడం కోసం కాదని, శృంగారం లోని మాధుర్యాన్ని సృష్టి ధర్మంగా భావించి ధైర్యంగా గొంతు ఎత్తి చాటి చెప్పే పరిపక్వత కోసం అని పదే పదే పేర్కొంటునప్పటికీ అవి పెద్దగా పని చేయలేదు.
ఇక అందరూ ఆతృతతో ఎదురు చుసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడుదలై సోషల్ మీడియా ద్వారా మేధావుల వర్గాన్ని చెందిన ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఇలా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించిన వారిలో ఎందరో మహిళలు కూడా వున్నారు. వీరి ట్వీట్స్ ని రీట్వీట్ చేస్తూ మహిళా గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం అని ఎదుర్కొంటున్న ఆరోపణలని తప్పు అని రుజువు చేసేందుకు ప్రచారంగా గాడ్ సెక్స్హి అండ్ళ ట్రూత్ పై సానుకూలంగా స్పందిస్తున్న మహిళల అభిప్రాయాన్నే వాడుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.