ఆ హీరోయిన్ పారితోషకం తగ్గించేసిందహో

Update: 2018-02-21 09:39 GMT

ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న సమంత.. ఆ సినిమా విడుదలకు ఇంకా నెల టైం ఉండడంతో... తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కి జోడిగా రామలక్ష్మి గా అదరగొడుతున్న సమంత... ని పెట్టి కట్ చేసిన రంగస్థలం టీజర్ లో సమంత హావభావాలు, అందం, నవ్వు, అమాయకత్వం ఇలా అన్ని హైలెట్ గానే ఉన్నాయి. మొదటిసారి డి గ్లామరస్ పాత్రలో కనబడనున్న ఈసినిమాలో సమంత మాటలు రాని అమ్మాయిగా కొత్తగా ట్రై చేస్తుంది.

ఇకపోతే సమంత రంగస్థలం విడుదలకు ముందే తనకు ఎంతో నచ్చిన యు టర్న్ సినిమాని సైతం సెట్స్ మీదకెక్కించేసింది. మహానటి షూటింగ్ తోపాటు... సమంత ఈ యు టర్న్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టేసింది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ గా భారీ రెమ్యునరేషన్ తీసుకున్న సమంత ఇప్పుడు తన పారితోషకాన్ని తగ్గించిందని టాక్ వినబడుతుంది. రంగస్థలం, మహానటి సినిమాలకు తీసుకుంటున్న పారితోషకంలో చాలా తక్కువ పారితోషకాన్ని సమంత యు టర్న్ సినిమా కోసం తీసుకుంటుందట.

అయితే సమంత కున్న క్రేజ్ పెళ్లితర్వాత పడిపోయి... అవకాశాల కోసం ఇలా రెమ్యునరేషన్ తగ్గించలేదు. యు టర్న్ సినిమా హీరోయిన్ ఒరింటెడ్ సినిమా కావడం... అలాగే ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కడంతో....సమంత ఇలా తన పారితోషకాన్ని తగ్గించేసింది. ఇప్పటివరకు సమంత నటించిన సినిమాల్లో కెల్లా ఈ సినిమా చాలా లో బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా మీద సమంతకున్న ఇష్టంతోనే ఇలా తక్కువ పారితోషకానికి సమంత ఈ సినిమా చేస్తున్నదన్నమాట.

Similar News