ఆ హీరోయిన్ కి పెళ్లా?

Update: 2018-02-06 21:30 GMT

సౌత్ లో దశాబ్ద కాలం పాటు హీరోయిన్ గా హవా కొనసాగించడమే కాదు ఇప్పటికి ఫుల్ ఫిట్నెస్ తో ఉన్న హీరోయిన్ శ్రియ శరన్ ఎప్పటికపుడు హాట్ గా లేటెస్ట్ ఫొటోస్ వదులుతూనే ఉంది. ప్రస్తుతం శ్రియ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా వుంది. అయితే ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తకుండా... లవ్ ఎఫ్ఫైర్స్ కి దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ ఒక న్యూస్ మంగళవారం వెబ్ మీడియా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది కూడా శ్రియ ప్రేమ వివాహం చేసుకోబోతుందనే న్యూస్ బాగా హైలెట్ అయ్యింది.

ఓ రష్యన్ యువకుడితో శ్రియ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటే చాలా సన్నిహితంగా ఉంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే పరిచయామైన వీరికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసిందని అంటున్నారు.శ్రియ శరన్ పెళ్లి వచ్చే నెల మార్చ్ లో ఉండబోతుందంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం శ్రియ రష్యా వెళ్లిందని... అబ్బాయి తల్లి తండ్రులతో పెళ్లి విషయం మాట్లాడేందుకు వెళ్లిందని అంటున్నారు.

అలాగే శ్రియ పెళ్లి రాజస్థాన్ లో జరగబోతుందని.... ఈ పెళ్ళికి అక్కడ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మరి ఉదయం నుండి ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే శ్రియ మాత్రం పెదవి విప్పకుండా మిన్నకుండడంతో.. ఈ పెళ్లి వార్తలు నిజమని జనం ఫిక్స్ అవుతున్నారు.

Similar News