ఆ హీరోయిన్ ఏ కావాలంటున్నాడట

Update: 2018-02-19 12:15 GMT

కన్నడలో బ్లాక్ బస్టర్ అయినా కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో హీరో నిఖిల్ 'కిరాక్ పార్టీ' పేరుతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మార్చి లో విడుదలకు రెడీ అవుతుంది. అలానే ఈ సినిమా తర్వాత నిఖిల్ ఓ తమిళ్ సినిమాను రీమేక్ చేయనున్నాడు.

తమిళంలో హిట్ అయినా 'కణితన్' ను రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో వుంది. హీరోయిన్స్ గా కేథరిన్ .. రష్మిక .. మేఘా ఆకాశ్ పేర్లు వినిపించాయి. అయితే వీరిలో ఎవరినీ ఎంపిక చేయలేదట. హీరో నిఖిల్ పాత్ర పరంగా షాలినీ పాండే అయితే బాగుంటాడని చెప్పాడట. దింతో నిర్మాతలు ఆమె దగ్గరకు వెళ్లారు.

షాలినీ స్క్రిప్ట్ మొత్తం చూస్తేనే కానీ ఒక నిర్ణయానికి రాలేనని చెప్పడంతో స్క్రిప్ట్ ను అందజేశారు. కథ.. తన క్యారక్టర్ తనకు నచ్చాయనీ, త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Similar News