ఆ హీరోను అవమానించారా?

Update: 2018-02-11 10:00 GMT

మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం నాని, శర్వానంద్ లు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. నాని వరుస హిట్స్ తో స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తుంటే.. శర్వానంద్ మాత్రం సింపుల్ గా హిట్స్ కొట్టుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. అయితే ఈ హీరోలిద్దరి పక్కన ఛాన్స్ వస్తే హీరోయిన్స్ వదులుకునే పరిస్థితుల్లో లేరు. కానీ ఆ ఇద్దరిలో శర్వానంద్ ని ఇద్దరు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ డైరెక్షన్ లోను, హను రాఘవపూడి డైరెక్షన్ లోను రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

సుధీర్ వర్మ చిత్రంలో శర్వానంద్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అయితే డ్యూయెల్ రోల్ అంటే.. ఖచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే. మరి శర్వా పక్కన ఆ ఇద్దరు హీరోయిన్స్ కింద కాజల్ అగర్వాల్ ని మరొకరు నిత్యా మీనన్ లను ఎంపిక చేసింది చిత్ర బృందం. అయితే మొదట్లో ఒప్పుకున్నా కాజల్, నిత్య మీనన్ లు సడన్ గా ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. అయితే కారణం మాత్రం ఆ హీరోయిన్స్ కి నిర్మాతలిచ్చే రెమ్యునరేషన్ సరిపోలేదంట. కానీ బయట మాత్రం ఆ హీరోయిన్స్ డేట్స్ సర్దుబాటు చెయ్యలకే శర్వా ప్రోజెక్టు నుండి తప్పుకున్నారనే టాక్ నడుస్తుంది.

కానీ రెమ్యునరేషన్ సరిపోకే... వారు శర్వానంద్ పక్కన నటించమని మొహమాటం లేకుండా చెప్పెయ్యడంతో నిత్యా మీనన్ ప్లేస్ లోకి హలో సినిమాలో నటించిన కళ్యాణి ప్రియదర్శిని ని ఎంపిక చేశారట. మరి కాజల్ స్థానంలోకి ఏ హీరోయిన్ ని తీసుకోవాలా అని చిత్ర బృందం తర్జన భర్జనలు పడుతుంది. ఇక ఈ సినిమాలో ఒక రోల్ లో శర్వానంద్ డాన్ లా కనిపిస్తాడని టాక్ బయటికి వచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది.

Similar News