ఆ హీరో నా ఐడియాని కొట్టేసాడంటున్న టాప్ డైరెక్టర్!!

Update: 2017-07-10 04:49 GMT

ఎన్టీఆర్ 'జై లవ కుశ' టీజర్ విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. అందులోని మొదటి టీజర్ అయినా జై టీజర్ ని విడుదల చేశారో లేదో ఇలా తారక్ నటనను పొగుడుతూ టాలీవుడ్ ప్రముఖులంతా అభినందించేసేసారు. 'జై' పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో తారక్ అద్భుతమైన నటన కనబర్చాడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తునారు. జై లవ కుష లో ‘జై’ క్యారక్టర్ రావణ భక్తుడి పాత్ర. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ని నెగెటివ్ షేడ్‌లో చూపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ ని అందరూ ఆకాశానికి ఎత్తేస్తుంటే టాలీవుడ్ లో ఒక్క డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ 'జై' టీజర్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడట. అంతలా ఉలిక్కిపడిన డైరెక్టర్ మరెవరో కాదు ఎన్టీఆర్ తో 'టెంపర్' చిత్రాన్ని తెరకెక్కించిన పూరి జగన్నాధ్. అయితే పూరి అంతలా షాక్ అవడానికి ఒక బలమైన కారణమే ఉందట.

అసలు పూరి కడుపుమంటకి కారణమేమిటంటే..... పూరి, ఎన్టీఆర్ కలిసి గత డిసెంబర్ లో ఒక స్టోరీ డిస్కషన్ లో కూర్చున్నారట. ఆ స్టోరీలో ఐడియా ఇప్పుడు 'జై' టీజ ర్లో కనిపించిందని పూరి జగన్నాధ్ అనుమానపడుతున్నాడంటూ పూరి సన్నిహితులు చెబుతున్నారు. నిజంగా అది నిజమని తెలిస్తే తన స్క్రిప్ట్ కాపీ చేసినట్లుగా ముద్ర వెయ్యాల్సి వస్తుందని... పూరి.. తాజా చిత్రం 'పైసా వసూల్' సెట్స్ లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే పూరి, ఎన్టీఆర్ తో చెప్పిన కథతో గనక సినిమా తెరకెక్కితే గనక అది 100 కోట్ల బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అయ్యేదని... కానీ పూరి, ఎన్టీఆర్ ల మధ్య కథ విషయంలో కొన్ని విభేదాలు వచ్చాయని వారంటున్నారు.

ఇకపోతే స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కి ఎంతగా నచ్చినప్పటికీ.... బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలో కొన్ని మార్పులు చేయాలని పూరీని ఎన్టీఆర్ కోరాడట. కానీ దానికి పూరీ జగన్నాథ్ ఒప్పుకోలేదట. ఆ ప్రాజెక్ట్ అలా అటకెక్కిందన్నమాట. అయితే తాజాగా 'జై' టీజర్ ని చూసిన పూరి తాను గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన ఐడియా లాగా ఉందని... తన ఐడియాను ఎవరో దొంగిలించి ఉండవచ్చునని భావిస్తున్నాడని కూడా చెబుతున్నారు. అయితే పూరి విషయంలో ఇలా స్టోరీ బయటికి వెళ్లిపోవడం కొత్త కాదని... అయినా రచ్చ చేయడం ఎందుకని పూరీ కామ్‌గా ఉండిపోయాడు అని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నమాట.

ఇప్పుడు జై టీజర్ లో చూసిన ఎన్టీఆర్ కేరెక్టర్ తన కథలోని కేరెక్టర్ ఒకటే అని పూరి సన్నిహితులు చెప్పేమాట 'జై లవ కుశ' డైరెక్టర్ బాబీ దగ్గరకి చేరడంతో... దానికి బాబీ నేను కష్టపడి రాసుకున్న కథ ఇది అని.... పూరి మాటలు కొట్టిపడేస్తున్నాడట. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకటైన ‘జై’.. నా ఒరిజినల్ స్క్రిప్ట్‌లో ఓ భాగం.. బహుశా పూరీతో ఎవరైనా ఇలాంటి క్యారక్టర్ గురించి చర్చించి ఉండవచ్చు. కానీ ఆ విషయం నాకు తెలియదు. అయినా ఒకరికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని డైరెక్ట్ గా అన్నట్లు వార్తలొస్తున్నాయి..

Similar News