ఆ హీరో డ్రగ్గిస్టా!!

Update: 2017-07-18 08:00 GMT

ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది. టాలీవుడ్ లో మాత్రమే ఈ డ్రగ్ మాఫియా పాతుకుపోలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలోని ఈ డ్రగ్ మాఫియా వెళ్లానుకుని ఉంది. కానీ ఇప్పుడు మాత్రం డ్రగ్ డీలర్ కెల్విన్ అరెస్ట్ తో టాలీవుడ్ మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే పలు సెలబ్రిటీస్ పేర్లు బయటికి వచ్చి సంచలనం సృష్టిస్తుంటే మరికొన్ని టాప్ సెలబ్రిటీస్ పేర్లు బయటికి రావాల్సి ఉందంటున్నారు. ఇకపోతే నేను కూడా డ్రగ్గిస్టునే.... డ్రగ్స్ వాడుతానని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక టాప్ హీరో.

ఆ హీరో మన టాలీవుడ్ హీరో కాదులెండి. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాను కూడా డ్రగ్స్ వాడుతానని చెబుతున్నాడు. రణబీర్ నటించిన జగ్గా జాసూస్ పబ్లిసిటీలో భాగంగా రణబీర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన చిన్నతనంలోనే డ్రగ్స్ కి అలవాటు పడ్డానని... కానీ తర్వాతర్వాత డ్రగ్స్ వాడకం మంచిది కాదని తెలుసుకుని ఆ అలవాటుకు మెల్లగా దూరమయ్యానని చెబుతున్నాడు. ఇక పెద్దయ్యాక ఒకసారి కావాలనే డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందట. అలా డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది కూడా సినిమా కోసమేనట. తాను రాక్ స్టార్ లో నటించేటప్పుడు ఒక సన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే డ్రగ్స్ వాడాల్సి ఉండడంతో... చాలా తక్కువగా డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నాడు.

తక్కువ మోతాదులో డ్రగ్ తీసుకుని ఆ సీన్ చేసేసరికి ఆ సీన్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చిందని... చెప్పుకొచ్చాడు. మరి డ్రగ్స్ తీసుకుంటే యాక్టీవ్ అయ్యి అనుకున్న పనులను మరింతబాగా చేయగలరనే విషయాన్నీ ఓపెన్ గా చెప్పేసాడు రణబీర్. మరి దానికోసమే చాలామంది ఇలా డ్రగ్స్ కి బానిసలై జీవితాల్ని కోల్పోతున్నారు.

Similar News