'దేవదాసు' వంటి హిట్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఇలియానా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో జోడి కట్టింది. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయింది ఇలియానా. మహేష్ బాబుతో 'పోకిరి' సినిమాలో నటించిన ఇలియానా ఒక్క దెబ్బకి టాలీవుడ్ లో టాప్ కి చేరిపోయి మిగతా హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో కెరీర్ పీక్ స్టేజి లో ఉండగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అక్కడా సక్సెస్ ని అందుకుంది. కానీ బాలీవుడ్ మీద మోజుతో టాలీవడ్ ని నిర్లక్ష్యం చేసింది.
అయితే బాలీవుడ్ లో అనుకున్న అవకాశాలు లేక డీలా పడిన ఇలియానా అప్పుడప్పుడు సౌత్ కి వస్తూనే హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే వుంది. మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది ఈ భామ. 'ముబారకన్, బాద్షాహో' సినిమాలతో బాలీవుడ్ లో మళ్ళీ చక్రం తిప్పడానికి రెడీ అయింది. అలాగే ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రు నిబోన్ తో ప్రేమలో మునిగితేలుతోంది.
అయితే ఇపుడు ఇలియానా బాలీవుడ్ లో నటించిన 'ముబారక్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సందర్భంగా ఇలియానా మీడియాకి ఇంటర్వ్యూ లు గట్రా ఇస్తూ బిజీగా వుంది. అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఇలియానా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను టాలీవుడ్ లోకి ఎంటరైనప్పుడు నటించిన మొదటి సినిమా 'దేవదాసు' హీరో రామ్ తో ఇప్పటికి టచ్ లో ఉంటానని చెప్పిన ఇలియానా, టాలీవుడ్ లో మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ వంటి ప్రముఖ హీరోలందరితో నటించినట్లు తెలిపింది.
అలాగే టాలీవుడ్ లో తనకు రవితేజ ఎక్కువగా ఇష్టమని తెలిపింది. అతనితో మూడు సినిమాల్లో నటించానని.. షూటింగ్ స్పాట్ లో రవితేజ హైపర్ యాక్టివిటీతో తో ఉంటాడని చెప్పింది. ప్రస్తుతం తాను బాలీవుడ్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.