మలయాళంలో నటి భావన కిడ్నాప్ కేసులో దిలీప్ అరెస్ట్ వంటి విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే మలయాళ నటి కిడ్నాప్ అంటున్నారే గాని ముందులా భావన పేరును మీడియా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఎందుకు అంటే హీరోయిన్ పేరును బయటికి చెప్పి ఆమెని ఇబ్బందులకు గురి చెయ్యడం ఎందుకు అని. కానీ మొన్నటిదాకా కేరళ నటి భావన, మలయాళ నటి భావన అని మెన్షన్ చేసిన మీడియా ఇప్పుడు మలయాళ నటి, కేరళ నటి అంటూ మెన్షన్ చేస్తుంది కానీ ఆమె పేరు ని ఎక్కడా బయటికి రానివ్వడం లేదు. కారణం వేధింపులకు గురైన వారి పేర్లను బయటికి చెప్పకూడదనే రూల్ ఉండడమేనట. అసలు జరిగిందంతా జరిగాక ఇప్పుడు కప్పెట్టడం ఎందుకుగాని..... ఇప్పుడు ఈ విషయంలో తమిళనాట పెద్ద రచ్చే జరుగుతుంది.
తమిళనాట కమల్ హాసన్, నటి భావన కి న్యాయం జరగాలంటూ ఆమెకు మద్దతునిస్తున్నామని చెప్పాడు. ఆమె కేవలం ఒక మహిళ అనే భావనికి మద్దతిస్తున్నామని... తానొక నటి అయినందువలనే తాము మద్దతు ఇవ్వలేదని భావన పేరును ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చాడు. అదిగో కిడ్నాప్ వ్యవహారంలో భావన పేరు ఎందుకు మెన్షన్ చేసారంటూ మీడియా కమల్ ని నిలదియ్యగా.... ఎందుకు పేరును దాయడం... ఆమె గురించి అందరికి తెలిసేలా చెయ్యండి. అంతేగాని ఒకవేళ పేరు దాయాల్సి వస్తే ద్రౌపది అనండి గాని మహిళా అనకండి అంటూ సమాధానం చెప్పాడు.
అయితే ఇప్పుడు తాజాగా కమల్ భావన ప్లేస్ ( అంటే అలా లైంగిక వేధింపుల కేసులో) లో తన కూతురు ఉన్నా కూడా ఆమె పేరు తాను ధైర్యం గా బయటికి చెప్పేవాడినని చెబుతున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న బిగ్ బాస్ షో కాంట్రవర్సీ గురించి కూడా స్పందించిన కమల్ తనకు ఎటువంటి కేసుల గురించి భయం లేదని చెప్పాడు.