ఆ పాత్ర నేను చేస్తానంటున్న పవన్

Update: 2017-11-24 05:50 GMT

మెగాస్టార్ చిరు నటిస్తున్న సై రా నరసింహారెడ్డి సినిమా వచ్చే నెల 6 నుండి సెట్స్ మీదకెళ్లబోతుంది. సై రా కి సంబందించిన షూటింగ్ పనులన్నీ చక చక జరుగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సై ర కి సంబందించిన టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ చేసి సై రా మొదటి షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సై ర నరసింహారెడ్డి ఇండియాలోని నాలుగైదు భాషల్లో విడుదల చెయ్యడానికి నిర్మాత చరణ్, దర్శకుడు సురేందర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పలుభాష నటీనటులను ఎంపిక చేశారు. నాలుగైదు భాషాల బడా స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా సై రా సినిమా లో ఒక కీలక పాత్ర కోసం హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఆ కీలక పాత్ర సై రా లో కేవలం 10 నిముషాలు మాత్రమే ఉంటుందట. అయితే ఆ పాత్ర సినిమా కథను మలుపు తిప్పే పాత్ర అవడంతో.. ఎవరైనా స్టార్ హీరోతో ఆ పాత్ర చేయించాలని చిత్ర బృందం భావించి.. ఆ పాత్ర ని వెంకటేష్ తో చేయించాలనుకున్నారట. అయితే చిత్ర బృందం ఇంకా వెంకీని అప్రోచ్ అవ్వకముందే.. ఆ పది నిమిషాల కీలక పాత్రను తాను పోషిస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చాడట. మరి ఆ పాత్ర కీలమైనది అనేది పక్కన పెడితే... ఆ పాత్రలో పవన్ నటిస్తే సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోతాయి.

అసలు మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్ అంటే మెగా అభిమానులకే కాదు యావత్ సినీ ప్రపంచానికి చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇకపోతే ఈ సినిమాలో చిరు రెండో తమ్ముడు నాగబాబుకు కూడా ఒక పాత్రని సెట్ చేశారనే టాక్ వినబడుతుంది. మరి ఈ రెండు విషయాల్లో నిజమెంత ఉన్నప్పటికీ... కేవలం ఈ న్యూస్ కె మెగా ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు.

Similar News