ఆ దర్శకుడిని పక్కన పెట్టేస్తున్నారా?

Update: 2017-11-01 11:00 GMT

టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల తన ఫామ్ ని పూర్తిగా కోల్పోయాడు.వరుస పరాజయాలతో ఈ దర్శకుడు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఒక కథను సిద్ధం చేసుకుని ఉన్నాడు. అయితే శ్రీను వైట్ల కు అసలు అవకాశమే కాదు.... కథ వినే హీరోనే లేకుండా పోయాడు. అయితే అనుకోకుండా శ్రీను వైట్ల చిత్రాలతో మంచి ఫామ్ లోకొచ్చిన రవితేజ ఇప్పుడు తాజాగా శ్రీను వైట్లకి అవకాశం ఇచ్చాడు. ఇంకేంటి ఈ సినిమాని బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడానికి కూడా రెడీ అయ్యింది.

అన్ని ఓకే గాని ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది మాత్రం ఎవ్వరి ఊహకి అందడంలేదు. శ్రీను వైట్ల గురించి అంతా తెలిసే అతనితో సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిన మైత్రి మూవీస్ వారు ఇప్పుడు ఆయనకు కావాల్సినంత బడ్జెట్ పెట్టడానికి ఆలోచనలో ఉందనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా శ్రీను వైట్ల - రవితేజ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మైత్రివారు ప్రస్తుతానికి సిద్ధంగా లేరట. ఎందుకంటే రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో మైత్రి వారు నిర్మిస్తున్న రంగస్థలం సినిమా ఎప్పటికి పూర్తవుతుందో అస్సలు క్లారిటీ లేదు. అలాగే రంగస్థలం తో పాటే ఇప్పుడు తాజాగా నాగ చైతన్య - చందు మొండేటి సినిమాని నిర్మించడానికి రెడీగా ఉన్నారు మైత్రి వారు.

ఆ సినిమా కూడా రేపో మాపో సెట్స్ మీదకెళ్తుంది. మరి చైతు - చందు సినిమా పూర్తయ్యేవరకు శ్రీను వైట్లని మైత్రివారు పక్కన పెట్టేస్తారు. మరి ఏ దిక్కు లేక ఎదురు చూస్తున్న శ్రీను వైట్ల కూడా వెయిట్ చెయ్యక తప్పేలా లేదుమరి.

Similar News