ఫిదా’ చిత్రంతో చాన్నాళ్ల తరువాత సత్తా చాటిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఆ రేంజ్ హిట్ ని అందుకున్నాక కూడా శేఖర్ కమ్ముల ఇంకా తన తదుపరి మూవీ ని స్టార్ట్ చెయ్యలేదు. అయితే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో శేఖర్ కమ్ముల సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల చెప్పిన లైన్ విజయ్ దేవరకొండకు నచ్చి డెవలప్ చెయ్యమని చెప్పారట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. ఈ కథ దాదాపుగా పూర్తి కావొస్తుందట..
ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఇస్ బ్యూటిఫుల్' మూవీ లో విజయ్ దేవరకొండ ఒక చిన్న పాత్రలో నటించాడు. విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల ని తన గురువుగా భావిస్తాడు. సో ఫైనల్ గా విజయ్ కి తన గురువు దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో 'టాక్సీ వాలా' అనే మూవీ లో నటిస్తున్నాడు. అలాగే పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలతో పాటు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ కి సైన్ చేసాడు విజయ్ దేవరకొండ.