ఆ ఛానల్ పై విరుచుకు పడ్డ దర్శకుడు!

Update: 2018-02-20 12:03 GMT

ఈ మధ్యన ఏ ఛానల్ చూసినా.. ఒకే వార్తను తిప్పి తిప్పి చూపిస్తూ జనాలకు విసుగు తెప్పిస్తున్నారు. ఫ్రెష్ గా న్యూస్ ఛానల్ పెట్టి వార్తలు విందామంటే ... పొద్దున్న చూసినా వార్త నే పట్టుకుని వేళ్ళాడుతూ దాన్నే మార్చి మార్చి చూపిస్తూ చికాకు తెప్పిస్తున్నారు. ఇక మీడియాలో ఏ రాజకీయపార్టీలకు కొమ్ముకాయకుండా ఉన్న ఏకైక న్యూస్ ఛానల్ ఏదయ్యా అంటే వెంటనే టీవీ 9 పేరే చెబుతారు. ఒకప్పుడు టీవీ 9 లో న్యూస్ చూడాలంటె తెగ ఇంట్రెస్ట్ ఉండేది కానీ... రాను రాను ఈ ఛానల్ లో కూడా విసుగు తెప్పించే వార్తలు ఎక్కవయ్యాయి. ఏదో ఒక విషయమై డిబేట్ పెట్టడం లైవ్ లో.. ఆ డిబేట్ లో పాల్గొన్న వారు ఛండాలంగా మాట్లాడడం ఇలా అనేక విషయాలతో న్యూస్ ఛానల్స్ రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. ఏదన్నా సన్సేషనల్ న్యూస్ అయితే చాలు.. ఉదయం మొదలుకుని రాత్రి వరకు అదే న్యూస్ ని హైలెట్ చేస్తూ చిరాకు పెడుతున్న ఈ న్యూస్ ఛానల్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రిమినల్ కేసుపెడుతున్నట్లుగా తన ట్విట్టర్ నుండి ట్వీట్ చేసాడు.

వర్మ ఈ మధ్యన జీఎస్టీ అనే ఫోర్న్ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించినందుకు గాను సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మకి పోలీస్ లు నోటీసులు పంపడం, పోలీస్ ల ఎదుట వర్మ విచారణకు హాజరవడం...ఇలా వర్మ ఈ మధ్యన బాగా హైలెట్ అయ్యాడు. అయితే వర్మ విషయంలో జీఎస్టీ మీద మహిళా సంఘాలతో డిబేట్ నిర్వహించగా అందులో వర్మ కొందరు మహిళా సంఘాల మహిళను కించ పరుస్తూ మట్లాడడంతో ఇప్పుడు వర్మ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. వచ్చే విచారణ లోగా వర్మ అరెస్ట్ అవుతాడంటా నిన్న సోమవారం మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే కేవలం టీవీ 9 వారు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ వార్త కథనాలు ప్రసారం చేస్తున్నారని.. అందుకే టీవీ 9 మీద క్రిమినల్ కేసు పెడుతున్నట్టుగా ట్వీట్ చేసిన వర్మ.. టీవీ 9 చానల్ యాంకర్ రజనీకాంత్ పై నిప్పులు చెరిగాడు.

నిజాలను ప్రజలకు చేరవెయ్యకుండా రజినీకాంత్ తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని వర్మ ఆరోపించాడు. కేవలం తనపై అసత్యాలను ప్రసారం చేస్తూ... తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నాడు. ఓ నేరంపై విచారణ జరుగుతూ ఉండగా....విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అంటూ వార్తలు అందించడం కరెక్ట్ కాదని.. అది కూడా నేరమే అవుతుందని... అతి త్వరలో టీవీ9 భారత చట్టాలను ఎదుర్కోవాల్సి వుంటుందని ట్విట్టర్ సాక్షిగా ట్వీట్ తో హెచ్చరించాడు వర్మ.

Similar News