ఇండియా మొత్తం ఎదురు చూసిన మోస్ట్ వాంటెడ్ కపుల్ చాలా సిక్రెట్ గా .. ఫ్యాన్స్ ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ. హంగామా ఏమి లేకుండా పెళ్లి చేసుకున్నారు. అలానే బాలీవుడ్ లో ఇంకో జంట కూడా ఇలాంటి పెళ్లికే ప్లాన్ చేసుకుంటున్నారు.
బాలీవుడ్ లో రణవీర్ సింగ్.. దీపికా పదుకొనే గత కొంత కాలంగా లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్ళటం.. ఇద్దరు కలిసే తిరగటం జరిగింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా దీపికా పదుకొనే కుటుంబ సభ్యులు..పెళ్లి గురించి రణవీర్ సింగ్ కుటుంబంతో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారట. అలాగే ఇప్పటికే శ్రీలంక లో ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుననట్టుగా వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళికి సన్నద్ధం అయ్యారని.... సౌత్ ఇండియా స్టైల్ లో ఈ పెళ్లి జరుగుతుందని.. ప్రస్తుతం మ్యారేజ్ షాపింగ్ లో ఇరు కుటుంబాలు ఉన్నాయని టాక్. ఈ ఏడాది ప్రధమార్ధంలోనే వీరి పెళ్లి ఉండొచ్చు అనేది టాక్. మరి ఈ పెళ్లి సింపుల్ గా జరుగుతుందో... లేదంటే హడావిడి చేస్తూ చేసుకుంటారో అనేది దీపికా గాని రణ్వీర్ గాని స్పందిస్తేనే తెలుస్తుంది.