ఒక దశాబ్ద కాలం పాటు సక్సెస్ అనేదే లేకుండా సినిమా ఇండస్ట్రీలో హీరోగా తిరిగిన నితిన్ కి 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' తో హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటినుండి సెలక్టీవ్ కథలతో సినిమాలు చేసుకుంటూ హిట్స్ కొడుతున్న నితిన్ 'అ.... ఆ' సినిమా హిట్ తో బెటర్ పొజిషన్ లోకి వచ్చేసాడు. అ చిత్రం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని డైరెక్టర్ హను రాఘవ పూడి డైరెక్షన్ 'లై' సినిమాని చేసాడు. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 11 న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పూర్ గా వున్నాయి. రెండు చిత్రాలతో నువ్వానేనా అని పోటీకి దిగిన నితిన్ కి నిరాశే మిగిలింది.
'లై' సినిమా హిట్ తో తన మార్కెట్ ని పెంచేసుకోవాలని ఆశపడిన నితిన్ 'లై' సినిమా ప్లాప్ తో బొక్క బోర్లా పట్టాడు. 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక'తో పెట్టుకుని 'లై' చిత్రం సోది లోకి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ వీక్ లో 'లై' కలెక్షన్స్ ఏమంత గొప్పగా లేకపోగా సెకండ్ వీక్ లోనైనా పుంజుకుంటుంది అనుకున్న చిత్ర యూనిట్ కి మళ్ళీ నిరాశే ఎదురయ్యేలా వుంది. 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాల కలెక్షన్స్ పెరగడమే కాదు ఈ సెకండ్ వీక్ కూడా నిలకడగా కలెక్షన్స్ సాధించేలా కనబడుతున్నాయి.
కొత్త హీరోయిన్ మేఘ ఆకాష్, కొత్త విలన్ అర్జున్, నితిన్ నటన, కొత్త కథ... మైండ్ గేమ్ కాన్సెప్ట్ అన్ని కొత్తగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి తిరస్కరణే చూపారు. మరి క్లాస్ చిత్రాలుగా విడుదలైన 'నిన్ను కోరి, ఫిదా' చిత్రాలు మంచి కలెక్షన్స్ గా కొట్టెయ్యగా నితిన్ 'లై' మాత్రం క్లాస్ మూవీగా ప్రేక్షకులను అలరించకపోగా జయ జానకి...'కి, నేనే రాజు...కే ఎక్కువ ఓటేసి నితిన్ 'లై' ని పక్కన పెట్టేసారు. మరి ఇప్పుడు నితిన్ 'లై' చిత్రం నితిన్ కెరీర్ లోనే మరో ప్లాపుని మూటగట్టుకునేలా కనబడుతుంది. కనీసం సోలోగా వచ్చినా ఇంత భారీ నష్టం నుండి 'లై' తప్పించుకుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసున్నారు.