నేటి తరం హీరోలలో ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా ఇతర యువ హీరోలతో సమానమైన క్రేజ్ దక్కించుకోలేని హీరోలు మంచు మోహన్ బాబు వారసులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్. ఇతర హీరోల లా హీరోయిజం ఎలివేట్ అయ్యే కమర్షియల్ మాస్ అంశాలతో కూడిన చిత్రాలని మంచు విష్ణు ఎంచుకోకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. విష్ణు తొలి నుంచి ప్రేక్షకులకి వినోదాన్ని పంచి తద్వారా విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో ఆయనకి వరించిన విజయాలే డీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద. దానితో ఆయన వరుసగా కామెడీ ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంచుకుంటున్నారు.
గత ఏడాది మంచు విష్ణు నటించిన లక్కున్నోడు చిత్రం విడుదలై డిసాస్టర్ ఐన తరువాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కావటంతో ఆచారి అమెరికా యాత్ర పై పెద్దగా అంచనాలు లేవు. పైగా ఆ చిత్ర ట్రైలర్ కూడా మూస ధోరణిలో సాగే కథని తలపిస్తూ ప్రేక్షకులని మరింత నిరాశ పరిచింది. అయినప్పటికీ కామెడీ తో సినిమా గట్టెక్కే అవకాశాలు ఉన్నాయని, బ్రహ్మానందం బౌన్స్ బ్యాక్ చిత్రం అవుతుందని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ చిత్రం ఏకంగా మూడు నెలల పాటు విడుదల వాయిదా పడటంతో వున్న కొద్ది పాటి క్రేజ్ ని కూడా కోల్పోయింది ఆచారి అమెరికా యాత్ర. ఇక ఈ చిత్రం అఖండ విజయం సాధించాలంటే కచ్చితంగా ఏదైనా మిరాకిల్ జరగవలసిందే.