అసలు విషయం అదా?

Update: 2017-10-18 15:00 GMT

తమిళంలో విజయ్ హీరోగా కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన 'మెర్సాల్' చిత్రం ఈ రోజు దీపావళి కానుకగా విడుదలైది. అయితే తమిళంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులోనూ 'అదిరింది' గా విడుదల కావాల్సి ఉంది. తెలుగు, తమిళంలో ఒకేరోజు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా తమిళంలో మాత్రమే విడుదలై కొన్ని కారణాల చేత తెలుగులో విడుదల కాకుండా ఆగింది. అయితే అక్కడ తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో విడుదల కాకుండా ఆగడానికి కారణం ఏమిటంటే....తమిళంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడానికి చాలా కష్టాలే పడింది.

ఆనిమల్ బోర్డు తదితర వ్యవహారాల కారణంగా ఈ సినిమా సెన్సార్ ఆలస్యం జరగడం.. ఈ రోజు సినిమా విడుదలవుతుంటే.. చాలా ఆలస్యంగా సినిమా సెన్సార్ చెయ్యడంతో... ఇక్కడ తెలుగు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేద్దామనుకున్న టైం లో వరుస సెలవలు రావడంతో తెలుగులో సినిమా విడుదల కాకుండా ఆపి.. అక్కడ తమిళంలో మాత్రం విడుదల చేసేసారు. ఇక తెలుగులో కూడా హరిబారిగా కాకుండా కూల్ గా సెన్సార్ నిర్వహించి ఈ నెల 27 న తెలుగులో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తమిళంలో విడుదలైన 'మెర్సాల్' పర్వాలేదనిపించింది అంటున్నారు.

తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'మెర్సాల్' ని తెలుగులో కాస్త పబ్లిసిటీ చేస్తే ఇక్కడకూడా హిట్ అయ్యే అవకాశం ఉందని... 'మెర్సాల్' తెలుగు హక్కులనుదక్కించుకున్న శరత్ మరార్ ఆలోచన అంట. ఇదండీ అసలు 'అదిరింది' వచ్చే వారానికి పోస్ట్ పోన్ అవడానికి కారణం.

Similar News