అసలు విజయ్ ఒప్పుకుంటాడా?

Update: 2017-11-26 06:26 GMT

టాలీవుడ్ లో రాజశేఖర్ కూతురు శివాని సినిమా రంగ ప్రవేశం పై అందరిలో రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. అయితే శివాని ఒక తమిళ సినిమా నుండి వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. కానీ శివాని హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉండగా.... రాజశేఖర్ ఆర్ధిక పరిస్థితుల వలన అది కాస్తా లెట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రాజశేఖర్ కి గరుడావెగా తో ఆర్ధికంగా, ప్రొఫెషన్ పరంగా కాస్త రిలీఫ్ దక్కడంతో ఇప్పుడు శివానితో తెలుగు సినిమాకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా టాక్. ఇకపోతే శివాని ఆ మధ్యన చేయించుకున్న ఫోటో షూట్ నెట్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇక మెడిసిన్ చదువుతున్న శివాని ఇప్పుడు హీరోయిన్ గా కూడా చక్రం తిప్పడానికి రెడీ అవుతుంది. ఇక శివాని తో సినిమా ప్రయత్నాలు రాజశేఖర్ మొదలెట్టేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే శివాని వెండితెర మీద ఎంట్రీ ఇవ్వబోయే సినిమాలో హీరోగా ఎవరైతే బావుంటుందని కూడా జీవిత, రాజశేఖర్ లు ఆలోచిస్తున్నారట. అయితే శివాని పక్కన అర్జున్ రెడ్డి హీరో విజయ్ అయితే సూపర్ గా ఉంటుందని... ఆ దిశగా జీవిత, రాజశేఖర్ లు పావులు కదుపుతున్నట్టుగా కూడా చెబుతున్నారు. మరి అర్జున్ రెడ్డి తో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే శివాని మెడిసిన్ కూడా ఈ ఏడాదితో పూర్తవుతుంది. ఈలోపు విజయ్ సినిమాలు ఒక కొలిక్కి వస్థాయి. అటు శివాని చదువు పూర్తి అవుతుంది.

అప్పుడు ఫైనల్ గా విజయ్ దేవరకొండలో కూర్చుని మాట్లాడి శివాని తో సినిమాకి విజయ్ ని ఒప్పిద్దామనే ఆలోచనలో జీవిత దంపతులు ఉన్నారట. మరి విజయ్ ఏమో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో. మరి శివాని డెబ్యూ హీరోయిన్. మరి శివాని సైడ్ రాజశేఖర్ దంపతులకు కథ నచ్చితేనే శివాని సినిమా చేస్తుంది. మరి ఆ కథ విజయ్ దేవరకొండకి నచ్చాలి. అసలు ఇంత కన్ఫ్యూషన్ లో శివాని - విజయ్ కలయికలో సినిమా ఉంటుందా అనేది మాత్రం పెద్ద డౌట్?

Similar News