అసలు ముందు వద్దనుకున్నా!!!

Update: 2017-07-10 12:00 GMT

నలుగురు యంగ్ హీరోలు కలిసి నటించిన చిత్రం 'శమంతకమణి' ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోలుగా ఎదుగుతున్న నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబులు కలిసి ఈ మల్టి స్టారర్ చిత్రం చేశారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. నలుగురు యువ హీరోలు కలిసినటించనుండడం ఈ సినిమాకి ప్లస్. ఇక ఈ 'శమంతకమణి' ట్రైలర్ లో ఒక కారు చుట్టూ కథ అల్లుకుని ఉంటుందని అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మరొక కీ రోల్ లో కనబడబోతున్నాడు.

ఇక ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న నారా రోహిత్ మొదట్లో 'శమంతకమణి' లో నటించకూడదనుకున్నాడట. ఎందుకంటే పోలీస్ కేరెక్టర్ చెయ్యడం ఇష్టం లేక నారా రోహిత్ ఈ ఫిలింని వదులుకుందామనుకున్నాడట. ఇంతకుముందే రెండు మూడు సినిమాల్లో పోలీస్ కేరెక్టర్స్ చేసి ఉండడంతో మరీ రొటీన్ గా వుంటుందని భావించి ఈ చిత్రం చెయ్యకూడదనుకున్నాడట. కానీ కథ నచ్చడంతోనే ఈ సినిమాలో నటించానని చెబుతున్న రోహిత్ కి ఈ కేరెక్టర్ ని సజెస్ట్ చేసింది మాత్రం నాగ సౌర్య అంటున్నాడు. మొదటగా ఈ పోలీస్ కేరెక్టర్ నాగ సౌర్య దగ్గరికి వెళ్లడంతో నాగ సౌర్య కి కుదరక ఆ కేరెక్టర్ కి నారా రోహిత్ ని సజెస్ట్ చెయ్యడంతో ఆ కేరెక్టర్ నారా రోహిత్ కి వచ్చిందట.

ఇక ఈ విషయంలో నాగ సౌర్య కి థాంక్స్ చెప్పిన రోహిత్ 'శమంతకమణి' సినిమాతో ముగ్గురు మంచి ఫ్రెండ్స్ దొరికారాని చెబుతున్నాడు.

Similar News