అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ కి ఇప్పటికైనా తెలియాలి

Update: 2018-01-15 07:57 GMT

రాకెట్ వేగంతో మారుతున్న నేటి తరం సినీ ప్రేక్షకుల అభిరుచులకు తగిన విధంగా సినిమాలు రూపొందించగల నేర్పరులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే చిత్ర పరిశ్రమలో వున్నారు. అదృష్టవశాత్తు వారు వారి సినిమాలతో బిజీగానే వున్నారు. అయితే మూస ధోరణి కథలతో వారి ట్రాక్ రికార్డ్స్ గా వున్న దశాబ్ద కాలం క్రితం చిత్రాల స్టైల్ లో సినిమాలు రూపొందించే దర్శకులు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో కే.ఎస్.రవి కుమార్ ఒకరు. ఎం.రత్నం అందించిన అవుట్ డేటెడ్, ఎజెస్ ఓల్డ్ ఫార్ములా కథని జై సింహ గా తెరకెక్కించి నేటి తరం యువ ప్రేక్షకులని విసిగించిన కే.ఎస్.రవి కుమార్ పండుగ సందర్భముగా సరైన చిత్రం పోటీ లేకపోవటంతో బాక్స్ ఆఫీస్ వద్ద పరువాలేధనిపిస్తున్నారు.

కే.ఎస్.రవి కుమార్ తమిళ, తెలుగు భాషలలో అతి పెద్ద కాస్ట్ అండ్ క్రూ తో లింగ చిత్రం చేసి సూపర్ స్టార్ రజని కాంత్ కెరీర్ లోనే మరిచిపోలేని డిసాస్టర్ ఇచ్చి ఇప్పుడు 90 ల కాలం సినిమా ల మాదిరిగా జై సింహ తీర్చిదిద్దటంతో పాటు రజని కాంత్, బాలయ్య తనకు ఒకటే అని, ఇద్దరు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాకి సహకరిస్తారని చెప్పటంతో ఈ అవుట్ డేటెడ్ కంటెంట్ ని బాలయ్య కూడా నమ్మి, ఇష్టపడి చేసుకున్నాడని నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియా లో బాధ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి 2018 విన్నర్ మాత్రం జై సింహ నే. దర్శక రచయితల, కథానాయకుల మూస శైలిని ఆదరిస్తున్న ప్రేక్షకుల వైఫల్యం ఈ చిత్ర విజయం అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Similar News