ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ బాలీవడ్ కి చుక్కలు చూపెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి విజయంతో బాలీవుడ్ ఖాన్స్ త్రయానికి ముచ్చెమటలు పట్టి.... బాహుబలిని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక బాలీవుడ్ మూవీస్ సృష్టించిన కలెక్షన్స్ సునామి రికార్డులను బాహుబలి మూవీ సునాయాసంగా అధిగమించి రికార్డులు నెలకొల్పింది. అయితే బాహుబలి 1000 కోట్ల క్లబ్బుని సృష్టించి అనతికాలంలోనే 1500 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన వెంటనే అమీర్ ఖాన్ తన 'దంగల్' చిత్రాన్ని హడావిడిగా చైనా లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కోట్ల కలెక్షన్స్ ఫేక్ అని తేలిపోయిందంటున్నారు.
ఇదే విషయాన్నీ అమీర్ ఖాన్ పీఆర్వో మీడియాకి వెల్లడించాడు. గత గురువారం వరకు చైనీస్ వెర్షన్‌తో కలిపి 'దంగల్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు 1,864 కోట్లు మాత్రమే అంట. అయితే ఈ లెక్కన మొత్తం ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం 'దంగల్' కాగా తర్వాత స్థానంలో బాహుబలి వుంది. కానీ బాహుబలిని చైనాలో కూడా విడుదల చేస్తే గనక 'దంగల్' ని దాటి 'బాహుబలి' మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.