రకుల్ ప్రీత్ సింగ్ ఖాకి సినిమా హిట్ అందుకున్నప్పటికీ ప్రస్తుతం అమ్మడు డైరీ ఖాళీ. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఏదో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసానని చెబుతున్నప్పటికీ అవి వచ్చే ఏడాది వేసవిలోగాని పట్టాలెక్కవట. మరి ప్రస్తుతం అమ్మడు రెస్ట్ తీసుకునే పనిలో ఉంది. అలాగే పెళ్లి గురించిన తనకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నట్లుగా కూడా చెబుతుంది. చేతిలో అవకాశాలు పోయేటప్పటికీ ఇప్పుడు పెళ్లి ముచ్చట్లు మొదలెట్టింది ఈ భామ.
ఇప్పటివరకు తనకెలాంటి లవ్ ప్రపోజల్ రాలేదని.. తన కో స్టార్స్ కూడా తనకి ఎప్పుడు ప్రపోజ్ చెయ్యలేదని... తనని అందరు ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశారని.. ఎప్పుడు అలాంటి దృష్టితో చూడలేదని చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తనకు కాబోయే వరుడు కి ఉండాల్సిన మొదటి అర్హత ఆడుగుల ఎత్తు అని చెబుతున్న రకుల్.... తాను పొడవైన అమ్మాయిని కాబట్టి.. అబ్బాయి ఆరడుగులు లేకుంటే బాగోదని.. ఈ డిమాండ్ విషయంలో తాను తగ్గేదే లేదని స్పష్టం చేసింది.
అయితే ఎత్తు విషయంలో దాదాపు 90 మందిని రిజెక్ట్ చేసిన మిగతా 10 మందిలో తాను వరుడిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని.... అలాగే అతను మంచి వ్యక్తి అయి ఉండాలని.. తనలాగే చాలా హుషారుగా స్పీడుగా ఉండాలని.. తాను ఇంత చురుగ్గా ఉండి.. అబ్బాయి మాత్రం డల్ గా ఉంటె అస్సలు భూగోడు కదా అని.... .వీటన్నింటికీ మించి తనకు.. అతడికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం చాలా కీలకమని.. ఫుల్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం చెంప దెబ్బ కొట్టేస్తానేమో అని రకుల్ తానూ పెళ్లాడబోయే వరుడికి ఉండాల్సిన లక్షణాలను ఏకరువు పెడుతుంది.