రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలను చేసుకుంటూ పోతున్న అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శిరీష్ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరక్కేక్కిన ఒక్క క్షణం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు కొత్తగా రాబోతున్నాడు. ఐ. వీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒక్క క్షణం టీజర్ విడుదలై అందరిని అమితంగా అకట్టుకుంది.
మరి దర్శకుడి మీద నమ్మకమో.. లేకుంటే టీజర్ తెచ్చిన హైపో తెలియదు గాని.. ఒక్క క్షణం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ ఒక డిఫ్రెంట్ కథతో వచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఐ వి ఆనంద్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా కి శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ జెమిని ఛానెల్ భారీ ధరకు అంటే...మొత్తంగా 3.20 కోట్లకు కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ భారీ ఫిగర్ అల్లు శిరీష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిగర్ కావడం గమనార్హం.
ఇక ఇప్పుడు ఒక్క క్షణం శాటిలైట్ రేట్ ను చూస్తుంటే సినిమాకు అదనంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ గా వున్న ప్రేక్షకులు సినిమా విడుదల తర్వాత కూడా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా తప్పకుండా మినిమమ్ వసూళ్లను సాదించగలదనే టాక్ వినిపిస్తోంది. మరి అల్లు శిరీష్ అదృష్టం ఎలా ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ డేట్ వరకు ఆగాల్సిందే.