అల్లు అర్జున్ ఎందుకు సైలెంట్ అయ్యాడు

Update: 2018-03-20 04:55 GMT

సమ్మర్ లో మూడు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. 'భరత్ అనే నేను'..'రంగస్థలం'..'నా పేరు సూర్య'. ఈ మూడు సినిమాల్లో మహేష్ అండ్ రామ్ చరణ్ సినిమాలు ఆల్రెడీ టీజర్స్ ద్వారా ట్రైలర్స్ ద్వారా హైప్ ని క్రియేట్ చేసారు. కానీ 'నా పేరు సూర్య' ఈమధ్య ఎక్కువ సందడి చేయడం లేదు.

ఉగాది పండగకి ఆ రెండు సినిమాలకి ప్రత్యేక పోస్టర్లు వదిలితే 'నా పేరు సూర్య' టీమ్‌ మాత్రం ఏ పోస్టర్‌ లేకుండా పండగ కానిచ్చేసింది. సడన్ గా 'నా పేరు సూర్య' టీం సైలెంట్ అయిపోవడం ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తోంది.

రామ్ చరణ్ 'రంగస్థలం' మేనియాలో ఉన్న ఫ్యాన్స్ ను ఇటు డైవర్ట్ చేయడం ఇష్టం లేకా.. 'రంగస్థలం' ప్రమోషన్స్ అన్ని అయిపోయి రిలీజ్ అయ్యాక 'నా పేరు సూర్య' ప్రొమోషన్స్ స్టార్ట్ చేసి జనంలోకి తీసుకెల్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఒక టాక్‌ వినిపిస్తోంది. సడన్‌గా సైలెంట్‌ అవడం చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. మే లో సినిమా కాబ్బట్టి ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రొమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు

Similar News